top of page

🚀 బీజేపీ, జనసేన పొత్తు పొడిచినట్లే..! 💥 ఢిల్లీకి పవన్ కల్యాణ్, కిషన్ రెడ్డి.. 🌟

🗳️ తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతుంటంతో భారతీయ జనతాపార్టీ స్పీడు పెంచింది. జనసేనతో పొత్తు విషయంపై తేల్చేందుకు బీజేపీ సిద్ధమైంది.🤝 అయితే, ఎవరికెన్ని సీట్లు అనేది తెలియాల్సి ఉందని ఇరుపార్టీల్లో టాక్ వినిపిస్తోంది.🚁

అయితే, జనసేన, బీజేపీ పొత్తుకు తుది రూపు ఇచ్చేందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ను కలవనున్నారు.🛫 ఈ భేటీ కోసం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. పవన్‌ వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి కూడా ఉన్నారు.👥 పొత్తులో భాగంగా ఏపీతో సరిహద్దు ఉన్న నియోజకవర్గాలను జనసేనకు కేటాయించే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది.🤔 ఈ భేటిలో జనసేన నేతలు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ పాల్ గొననున్నారు.📜 బీజేపీతో పొత్తుకు జనసేన సిద్ధమైందని.. అయితే సీట్ల విషయంపై చర్చించనున్నట్లు పేర్కొంటున్నారు.📊 ఈ క్రమంలో ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.🗳️ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని లక్ష్మణ్‌ అన్నారు.

🤝 ఈ విషయంలో రెండు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయని తెలిపారు.📆 ఎన్ని సీట్లు అన్నది త్వరలోనే నిర్ణయిస్తామని లక్ష్మణ్‌ ప్రకటించారు.📰 రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై స్పందించిన కిషన్ రెడ్డి..

🗳️ కాగా.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.🔀 కాగా.. బీఆర్‌ఎస్‌కి ప్రత్యామ్నాయం బీజేపీ కాదని..🗣️ కాంగ్రెస్ అన్న రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.🤷‍♀️ ఎవరి ఆలోచన వాళ్లది.. ఎవరి అభిప్రాయం వాళ్లది.. ఆయన అన్నంత మాత్రాన జరగదు.. ఏదైనా ప్రజలు తేల్చాలి అంటూ కిషన్ రెడ్డి తెలిపారు. 🗳️🤝🚁

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page