top of page

🛰️ ప్రజ్ఞాన్‌ మేల్కొనకపోయినా పర్వాలేదు.. రోవర్‌ పని చేసేసింది: ఇస్రో ఛైర్మన్‌. 🌌

🛏️ జాబిల్లిపై నిద్రాణ స్థితిలో ఉన్న ప్రజ్ఞాన్‌ రోవర్‌ తిరిగి మేల్కోకపోయినా ఎలాంటి సమస్యా ఉండదని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ అన్నారు. 💡

తన నుంచి ఆశించిన పనిని రోవర్‌ ఇప్పటికే పూర్తిచేసిందని పేర్కొన్నారు. 🤖 ప్రస్తుతం తాము మరిన్ని ప్రయోగాలపై దృష్టిపెట్టామని చెప్పారు. 🚀 గుజరాత్‌లోని గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లాలో ప్రఖ్యాత సోమ్‌నాథ్‌ ఆలయాన్ని ఇస్రో ఛైర్మన్‌ గురువారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 🙏 అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 🌡️ రోవర్‌ నిద్రాణ స్థితిలోకి వెళ్లాక చంద్రుడిపై రాత్రివేళ ఉష్ణోగ్రతలు దాదాపు మైనస్‌ 200 డిగ్రీల సెల్సియస్‌ దాకా పడిపోయాయని తెలిపారు. 🌬️ అంతటి శీతల వాతావరణం వల్ల దానిలోని ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్స్‌ దెబ్బతిని ఉండకపోతే ప్రజ్ఞాన్‌ మళ్లీ క్రియాశీలమవుతుందని చెప్పారు. 🛰️ ప్రస్తుతం ఇస్రో ఎక్స్‌రే పొలరీమీటర్‌ ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమవుతోందన్నారు. 🚀 కృష్ణబిలాలు, నెబ్యులాలు, పల్సర్లపై ప్రయోగాలు జరిపేందుకు.. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా నవంబరు లేదా డిసెంబరులో దాన్ని నింగిలోకి పంపుతామని తెలిపారు. 🌌


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page