శ్రీహరికోట షార్‌లో మరో ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలైంది. శుక్రవారం ఉదయం 9:17కి SSLV-D3 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. దీని ద్వారా E.O.S-08 ఉపగ్రహాన్ని రోదసిలో ప్రవేశపెడతారు. భూపరిశీలన ఈ మిషన్ టార్గెట్.. మిషన్ రెడీనెస్ రివ్యూ- MRRలో అన్నీ చెక్ చేసుకున్న శాస్త్రవేత్తలు నిర్దిష్ట సమాయానికే ప్రయోగం ప్రారంభమవుతుందన్నారు. రేపు నింగిలోకి పంపుతున్న ఉపగ్రహం బరువు 175.5 కిలోలు ఉంటుందని తెలిపారు. మైక్రోసాటిలైట్‌ను అభివృద్ధి చేయడం, భవిష్యత్ ఉపగ్రహాల కోసం కొత్త సాంకేతికతలను సిద్ధం చేయడం వంటివి లక్ష్యంగా పెట్టుకున్న ఇస్రో.. రాకెట్ లను ప్రయోగిస్తూ అంతరిక్షరంగంలో వరుసగా విజయాలు సాధిస్తోంది. SSLV-D3 ప్రయోగాన్ని ఇవాళే చేపట్టాల్సి ఉన్నా.. అనివార్యకారణాల వల్ల రేపటికి వాయిదా వేశారు. ఈ రాకెట్ ప్రయోగాన్నిను ఇండియన్ ఇండస్ట్రీ, NSIL సంయుక్తంగా ప్రయోగిస్తోంది. రాకెట్ ప్రయోగాన్ని చూసేందుకు సాధారణ పౌరులకు సైతం అవకాశం కల్పించారు. ప్రయోగాన్ని చూసేవారు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.రాకెట్ ప్రయోగానికి ఇవాళ్టి నుంచే కౌంట్‌డౌన్ ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం రాకెట్‌ను పంపుతున్నారు. అగ్నిపర్వతాల ముప్పును అంచనా వేసి విలువైన సమాచారం అందించేలా రాకెట్‌ను రూపొందించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో సైంటిస్టులు..
తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు ఇస్రో సైంటిస్టులు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అర్చకుల వేదాశీర్వచనం పొందారు. రేపు సతీశ్ ధావన్ సెంటర్ నుంచి జరిగే SSLV D3 రాకెట్ ప్రయోగం సక్సెస్ కావాలని దేవుణ్ని కోరుకున్నారు.