top of page

తెగిన తలను అతికించిన ఇజ్రాయెల్ వైద్యులు

వైద్యరంగంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న కృషికి ఫలితం సాధించారు ఇజ్రాయెల్‌లో వైద్యులు. వైద్య రంగంలోనే ఒక మిరాకిల్‌ను చేసి చూపించారు. ఓ కారు యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన, మరణం అంచుల్లో ఉన్న 12 ఏళ్ల బాలుడి తలను తిరిగి అటాచ్‌ చేశారు. జూన్‌లో జరిగిన ఈ ఆరేషన్‌ గురించి ఇటీవల ది టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌ ఇందుకు సంబంధించి సంచలన కథనం రిపోర్ట్‌ చేసింది.

ఏం జరిగిందంటే.. సులేమన్‌ హసన్‌ అనే బాలుడు సైకిల్‌ పై వెళ్తుండగా కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో అంతర్గతంగా మొండెంతో ఆయన తల తెగిపోయింది. అంటే.. బాలుడి పుర్రె దేహంతో ముఖ్యంగా వెన్నెముకతో విడిపోయింది. దీన్ని వైద్యపరిభాషలో బైలేటరల్‌ అట్లాంటో ఆక్సిపిటల్‌ జాయింట్‌ డిస్‌లొకేషన్‌ అంటారు. కారు ప్రమాదం తర్వాత బాలుడిని హదస్సా మెడికల్‌ సెంటర్‌కు వెంటనే ఫ్లైట్‌లో తీసుకువచ్చారు. అక్కడ వైద్యులు ఎమర్జెన్సీ సర్జరీ చేశారు.

గంటల తరబడి ఆపరేషన్‌.. వైద్యుల ప్రకారం, దాదాపు ఆయన తల మెడ బేస్‌ నుంచి దాదాపుగా వేరైపోయింది. అర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ఒహద్‌ ఎయినవ్‌ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సర్జరీ కొన్ని గంటలపాటు సాగిందని వివరించారు. కొన్ని కొత్త ప్లేట్లు, ఫిక్సేషన్లను డ్యామేజ్‌ జరిగిన చోట చేర్చాల్సి వచ్చిందని తెలిపారు. ఈ ఆపరేషన్‌ చేసే సామర్థ్యం తమకు ఉండటం, అలాగే.. ఆపరేషన్‌ రూమ్‌లో అత్యాధునిక పరికరాలు, సౌకర్యాలు ఉండటంతో ఇది సాధ్యమైందని అన్నారు. ఆ బాలుడు బతికే చాన్స్‌ కేవలం 50 శాతమే ఉండేదని, ఇప్పుడు ఆ బాలుడు సజీవంగా తిరిగి రావడమంటే మిరాకిల్‌ అనే చెప్పాలని వివరించారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page