top of page
Shiva YT

ఆ జిల్లాపై కేసీఆర్ ఫుల్ క్లారిటీతో ఉన్నారా ?..

🗳️తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలకంగా మారనుందనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది. మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగనుండటంతో.. అధికారం కోసం ప్రయత్నిస్తున్న ప్రధాన పార్టీలు ఎక్కువగా ఈ జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. గత ఎన్నికల్లో అధికారం దక్కించుకుని కూడా ఖమ్మం జిల్లాలో పెద్దగా ప్రభావం చూపించని అధికార బీఆర్ఎస్... ఈసారి అలాంటి పరిస్థితి రాకూడదనే ఆలోచనతో ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన మెజార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి (BRS) వచ్చేశారు. ఈసారి వారిందరికీ సీఎం కేసీఆర్ (KCR) టికెట్లు ఇవ్వడం గ్యారంటీ అనే చర్చ జరుగుతోంది. జిల్లాపై కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫోకస్ చేయడం.. జిల్లాకు చెందిన ముఖ్యనేత, ఖమ్మం(Khammam) మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) కాంగ్రెస్ వైపు వెళ్లడంతో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే దానిపై ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది.

🏛️ అయితే ఇటీవల తనను కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలతో ఈసారి ఖమ్మం జిల్లాలో మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ ఖాతాలో పడతాయని సీఎం కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. అంతేకాదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచార బాధ్యతను తానే పర్యవేక్షిస్తానని, గతంలో ఖమ్మం మినహా మిగతా నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ గెలవలేదని పేర్కొంటూ గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో ఒక్కసీటును ప్రత్యర్థి పార్టీలు గెలుస్తుండగా.. 9 సీట్లను బీఆర్ఎస్ గెలుస్తుందని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.

bottom of page