top of page
MediaFx

మూత్రంలో రక్తం ప్రాణాంతకమా?


రక్తం వల్ల మూత్రం ఎరుపు రంగులోకి మారుతుంది. ఆ సమస్యను హీమటూరియా అంటారు. మీ బిడ్డకు ఉన్న సమస్య హీమటూరియానా లేక ఇంకేవైనా కారణాల వల్ల వస్తుందా అనేది పరీక్షల ద్వారానే తేల్చాలి. మీ అబ్బాయి రక్తపోటు ఎలా ఉందో చెప్పలేదు. ముఖం వాపు ఉందంటున్నారు. ఈ లక్షణాలను పరిశీలిస్తే నెఫ్రయిటిక్‌ సిండ్రోమ్‌ సమస్య అయి ఉండవచ్చు. మూత్రంలో ప్రొటీన్లు పోవడాన్ని నెఫ్రయిటిక్‌ సిండ్రోమ్‌ అంటారు. కొన్నిసార్లు బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ బారినపడిన కొన్ని వారాల తర్వాత కూడా కిడ్నీలపై ప్రభావం ఉంటుంది. ఇటీవల వచ్చిన ఆరోగ్య సమస్యల గురించి వివరించ లేదు. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) శరీర భాగాలపై కూడా పనిచేస్తుంది. ఈ ఆటో ఇమ్యూన్‌ మార్పుల వల్ల గ్లోమరులో నెఫ్రయిటిస్‌ కండిషన్‌ ఏర్పడుతుంది. మీ అబ్బాయి సమస్య ఏమిటో కచ్చితంగా నిర్ధారించడానికి రక్త, మూత్ర పరీక్షలు చేయించాల్సిందే! ముందుగా పిల్లల వైద్యులను సంప్రదించండి. వీలయితే పీడియాట్రిక్‌ నెఫ్రాలజిస్ట్‌ని సంప్రదించండి. రక్త, మూత్ర పరీక్షలతోపాటు కిడ్నీలను అల్ట్రా సౌండ్‌ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఎదురు చూడాల్సిన సమయం కాదు. జబ్బు నిర్ధారణ తర్వాత చికిత్స ఉంది. కాబట్టి కంగారు పడవద్దు. ఆలస్యం చేయవద్దు.

bottom of page