ఉడుపి, కుక్కి, ధర్మస్థల చూడాలనుకునేవారికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం.
కోస్టల్ కర్నాకటలోనిప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు చూడాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీటూరిజం (IRCTC Tourism) హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. డివైన్ కర్నాటక (Divine Karnataka) పేరుతో రైల్ టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో ఉడుపి, శృంగేరి, ధర్మస్థల, కుక్కి, మంగళూరు కవర్ అవుతాయి. ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఐఆర్‌సీటీసీ డివైన్ కర్నాటక టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.ఐఆర్‌సీటీసీ కర్నాటక టూర్ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. పర్యాటకులు ఉదయం 6.05 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాలి. మొదటి రోజంతా జర్నీ ఉంటుంది. రెండో రోజు ఉదయం 9.30 గంటలకు మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉడుపి బయల్దేరాలి. సెయింట్ మేరీస్ ఐల్యాండ్, మాల్పే బీచ్ చూడొచ్చు. రాత్రికి ఉడుపిలో బస చేయాలి. IRCTC Kerala Tour:కేరళ అందాలు చూస్తారా? హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ
మూడో రోజు ఉడుపిలో శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించుకోవాలి. ఆ తర్వాత శృంగేరి బయల్దేరాలి. శారదాంబ ఆలయాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాత మంగళూరు బయల్దేరాలి. రాత్రికి మంగళూరులో బస చేయాలి. నాలుగో రోజు ఉదయం ధర్మస్థలలో మంజునాథ స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాత కుక్కి సుబ్రమణ్యకు బయల్దేరాలి. కుక్కిలో సుబ్రమణ్యస్వామిని దర్శించుకున్న తర్వాత మంగళూరు బయల్దేరాలి. రాత్రికి మంగళూరులో బస చేయాలి.ఐదో రోజు మంగళూరు లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. పిలికుల నిసర్గధామ, మంగళదేవి ఆలయం, కటీల్ ఆలయం, తన్నీర్‌బావి బీచ్ చూడొచ్చు. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. రాత్రి 9 గంటలకు మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కితే మరుసటి రోజు రాత్రి 8.05 గంటలకు కాచిగూడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
IRCTC Tirumala Darshan:విశాఖపట్నం నుంచి వీకెండ్ తిరుమల దర్శనం టూర్ ప్యాకేజీ ఐఆర్‌సీటీసీ డివైన్ కర్నాటక టూర్ ప్యాకేజీ ధర ఐఆర్‌సీటీసీ డివైన్ కర్నాటక టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే కంఫర్ట్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.15,420, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.17,160, స్టాండర్డ్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.12,420, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.14,160 చెల్లించాలి. నలుగురి నుంచి ఆరుగురు బుక్ చేసుకుంటే ఈ ప్యాకేజీ ధరలు వర్తిస్తాయి.ఇక ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకునేవారికి ప్యాకేజీ ధర కాస్త అధికంగా ఉంటుంది. కంఫర్ట్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.16,320, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.19,820, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.33,170, స్టాండర్డ్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.13,320, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.16,820, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.30,170 చెల్లించాలి.టూర్ ప్యాకేజీలో కంఫర్ట్ క్లాస్‌కు థర్డ్ ఏసీ ప్రయాణం, స్టాండర్డ్ క్లాస్‌కు స్లీపర్ క్లాస్ ప్రయాణం, ఏసీ హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.