top of page
MediaFx

సుప్రీం లీడర్‌ కావాల్సిన రైసీ మరణం తర్వాత.. ఆయన స్థానంలో ఎవరు..?


ఇరాన్ అధ్యక్షుడు రైసీ మే 19న మరణించిన విషయం తెలిసిందే. హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరాన్ లో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. అయితే ఇరాన్ సర్వోన్నత నాయకుడిగా అధికారం చేపట్టడానికి అడుగు దూరంలో నిలిచారు అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ. ఆ స్థానానికి అతనే తగిన వారని రాజకీవే వేత్తలు భావిస్తున్నారు. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్, 85 ఏళ్ల అయతొల్లా అలీ ఖమెనేయి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చ మొదలైంది. అయతొల్లా ఆరోగ్యంపై చాలా కాలంగా చాలామందిలో ఆసక్తి నెలకొంది. ఇస్లామిక్ రిపబ్లిక్ లో అంతిమ నిర్ణయం సుప్రీం లీడర్ కు ఉంటుంది.

అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే ఫస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆ పదవిని చేపడతారు. దీనికి దేశ సుప్రీం లీడర్‌ ఖమేనీ ఆమోద ముద్ర అవసరం. కాబట్టి రైసి మరణంతో ఇరాన్ విధానాలు మారుతాయని గానీ, దీని పరిణామాలు దేశాన్ని కుదిపేస్తాయని గానీ ఎవరూ భావించట్లేదు. ఆదిపత్యం వహించిన ఇరాన్ అధికార వ్యవస్తకు పరీక్షగా మారబోతుంది. మాజీ ప్రాసిక్యూటర్ అయిన రైసి మరణాన్ని ఆయన ప్రత్యర్థులు హర్షిస్తారు. 1980లలో రాజకీయ ఖైదీలను సామూహికంగా ఉరితీయడంలో రైసి పాత్ర ఉందని ఆరోపణలు కూడా ఉన్నాయి.

కొత్త సుప్రీం లీడర్ ను ఎన్నుకునే అధికారం ఉన్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్ పర్ట్స్ లో రైసీ సభ్యుడు. ఇది చాలా కీలకమైన స్థానం. ప్రస్తుతం తాత్కాళిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొహ్బీర్ వ్యవహరిస్తున్నారు. అయితే 50 రోజుల్లోగా అధ్యక్ష ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. కానీ రైసీ ర్యాంకు స్థానంలో ఎవరూ కనిపించడం లేదు. ఆయన స్థానంలో ఎవరు అధికారంలోకి వచ్చినా నిషిద్ద ఎజెండాతో పాటు పరిమిత అధికారాలను వారసత్వంగా పొందుతారు. సంప్రదాయవాదుల ఐక్యతను కాపాడే, అయతొల్లా అలీ ఖమెనేయికి విధేయంగా ఉండే కొత్త వ్యక్తిని నియమించాలని కోరుకుంటుందని చాథమ్ హౌజ్ థింక్ ట్యాంక్‌కు చెందిన మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ సనమ్ వకీల్ అభిప్రాయపడ్డారు.

bottom of page