top of page
Suresh D

ఐపీఎల్‌లో ముగిసిన ధోని శకం..🏏

ప్రతిష్ఠాత్మక ఐపీఎల్ 17వ ఎడిషన్ ప్రారంభానికి ఒక రోజు ముందు అంటే నిన్న సాయంత్రం మిస్టర్ కూల్ ఎం ఎస్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో యువ బ్యాటర్‌ రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ధోనీ 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అతని నాయకత్వంలో, CSK రెండు ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లతో సహా 5 IPL ట్రోఫీలను గెలుచుకుంది.రెండేళ్ల నిషేధం మినహా 14 ఏళ్లలో 212 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహించాడు. అలాగే ఛాంపియన్స్ లీగ్‌లో 23 మ్యాచ్‌లలో జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ 235 మ్యాచ్‌ల్లో చెన్నై 142 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 90 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అలాగే రెండు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగియగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. అంటే చెన్నై జట్టు కెప్టెన్‌గా ధోనీ సాధించిన విజయాల శాతం 60.42. ఐపీఎల్‌లో 14 సీజన్లకు మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో ఆ జట్టు 12 సార్లు ప్లే ఆఫ్‌కు చేరుకుంది. 2020, 2022లో మాత్రమే జట్టు ప్లేఆఫ్స్‌ కు చేరుకోవడంలో విఫలమైంది. అదే సమయంలో ఐదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్ గా నిలిచింది.🏏

bottom of page