top of page
MediaFx

మరో కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఓడితే ప్లేఆఫ్స్ నుంచి గుజరాత్ ఔట్..


IPL 2024లో, శుక్రవారం, మే 10న, ఈ సీజన్‌లోని 59వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ప్లేఆఫ్‌ కోణంలో చూస్తే ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత చాలా ఎక్కువ. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ జట్టు 11 మ్యాచ్‌లలో 4 విజయాలతో 8 పాయింట్లతో చివరి అంటే పదో స్థానంలో ఉంది. అదే సమయంలో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లతో టాప్ 4లో భాగంగా ఉంది.

శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓడిపోగా, ఆ జట్టు గత మూడు మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎస్‌కేపై ఓటమి ఎదురైతే ప్లేఆఫ్‌కు చేరుకోవాలన్న కల చెదిరిపోతుంది. గుజరాత్ బ్యాట్స్‌మెన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఓపెనింగ్ జోడి ఇప్పటివరకు చాలా నిరాశపరిచింది. కెప్టెన్ గిల్ కూడా ఓపెనర్‌గా పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేక పోవడంతో ఆ జట్టు తీవ్ర భారాన్ని మోయాల్సి వచ్చింది. అదే సమయంలో, బౌలింగ్‌లో కూడా మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ వంటి బౌలర్లు ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారు.

మరోవైపు, చెన్నై సూపర్ కింగ్స్ తమ చివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ముఖ్యమైన విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ ప్రదర్శన అంతగా లేకపోయినప్పటికీ బౌలర్లు అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నేటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించడం ద్వారా ప్లేఆఫ్స్‌కు తన క్లెయిమ్‌ను బలోపేతం చేయాలని కోరుకుంటున్నాడు. బౌలింగ్‌లో, ముస్తాఫిజుర్ రెహ్మాన్ బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చాడు. మతిషా పతిరానా కూడా గాయం కారణంగా దూరంగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో డెత్ బౌలింగ్ కాస్త బలహీనంగా మారింది.

పిచ్, వాతావరణం..

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం పిచ్‌లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో హోరాహోరీ కనిపిస్తోంది. ఈ మైదానంలో సగటు స్కోరు 170. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన 5 మ్యాచ్‌ల్లో గుజరాత్ రెండింట్లో గెలుపొందగా, ఆతిథ్య జట్టు పంజాబ్, ఢిల్లీ, ఆర్సీబీలపై ఓటమి చవిచూసింది. వాతావరణం గురించి చెప్పాలంటే, మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత 32 నుంచి 38 డిగ్రీల మధ్య ఉంటుంది. వర్షాలు పడే అవకాశం లేదు.

bottom of page