top of page

ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి🏏✨

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 8వ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిసింది. ఈ సిక్సర్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ బ్యాటర్లు ఐపీఎల్‌లో కొత్త చరిత్ర సృష్టించారు. అంటే, ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు బద్దలైంది. సరికొత్త చరిత్ర నమోదైంది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ట్రావిస్ హెడ్ 3 సిక్సర్లు బాదగా, అభిషేక్ శర్మ 7 సిక్సర్లు బాదాడు. మార్క్రామ్ 1 సిక్స్, హెన్రిక్ క్లాసెన్ 7 సిక్సర్లు  కొట్టాడు. దీంతో SRH ఇన్నింగ్స్‌లో 18 సిక్సర్లు నమోదయ్యాయి.

అనంతరం ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ 3 సిక్సర్లు బాదగా, ఇషాన్ కిషన్ 4 సిక్సర్లు బాదాడు. అలాగే నమన్ ధీర్ 2 సిక్సర్లు, తిలక్ వర్మ 6 సిక్సర్లు బాదారు. హార్దిక్ పాండ్యా 1, టిమ్ డేవిడ్ 3, రొమారియో షెపర్డ్ 1 సిక్స్ కొట్టారు. దీంతో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు మొత్తం 20 సిక్సర్లు కొట్టారు.

దీంతో ఉప్పల్ స్డేడియంలో మొత్తం సిక్సర్ల సంఖ్య 38కి చేరింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ పంచుకున్నాయి.

ఇంతకు ముందు ఈ రికార్డు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉండేది. 2018లో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు మొత్తం 33 సిక్సర్లు సిక్సర్లు బాది ఈ ప్రత్యేక రికార్డు సృష్టించాయి. ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టడంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ బ్యాటర్లు విజయం సాధించారు. దీంతో 38 సిక్సులతో ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాయి.🏏

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page