‘చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఏ ఆటగాడి కోసం ఏ ఫ్రాంచైజీతోనూ చర్చలు జరపలేదు. ముంబై ఇండియన్స్‌తో ట్రేడింగ్ చేయగల ఆటగాళ్లు కూడా మాకు లేరు.
రోహిత్ శర్మ సీఎస్‌కేలోకి వస్తున్నాడనేది కేవలం రూమర్ మాత్రమే’ కాశీ విశ్వనాథన్ అన్నారు. అంటే రోహిత్ శర్మను తీసుకొనేందుకు చెన్నై సూపర్ కింగ్స్ పెద్దగా ఆసక్తి చూపడంలేదన్న విషయం స్పష్టమవుతోంది. అయితే ఇప్పటికే ట్రేడింగ్‌కు ప్రయత్నించిన ఢిల్లీ క్యాపిటల్స్ లేదా గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలు రానున్న 29 రోజుల్లో రోహిత్ శర్మను కొనుగోలు చేస్తాయా? లేదా? అన్నది చూడాలి. 🔄🤔