top of page

🔄 సెంటిమెంట్ జిల్లాలో గులాబీ బాస్ చూపు ఎవరి వైపు..!

🏛️ పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. 🕰️ ప్రధానంగా ఎస్సీ – ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. 🛑 ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన వరంగల్ లోక్ సభ స్థానంపై ఫోకస్ పెంచాయి.

🎉 కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా ఓరుగల్లు ను తిరిగి కైవసం చేసుకుని కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనే ఉక్కు సంకల్పంతో ఉంది… ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జి కొండా సురేఖ గెలుపు వ్యూహాలపై నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. 🌐 మరోవైపు భారతీయ జనతా పార్టీ సైతం వరంగల్ ఉమ్మడి జిల్లాపై పట్టు సాధించాలంటే ఈసారి ఎలాగైనా వరంగల్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవాలని కసరత్తు చేస్తోంది. 🌟 బలమైన అభ్యర్థి ని బరిలోకి దింపే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు కమలనాథులు.

🔄 అయితే ఇప్పటికే రెండు పర్యాయాలు వరుసగా గెలుస్తున్న బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయంపై గురి పెట్టింది. 🏆 బలమైన అభ్యర్థి ఎంపికపై మేథోమధనం చేస్తోంది. గత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ గాలిలో అలవోకగా తెలిసిన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌కు ఈసారి విశ్రాంతి తప్పదని ప్రచారం జరుగుతుంది. 🏞️ మరీ ఆయన స్థానంలో ఎవరిని బరిలోకి దింపుతారు..? ఎవరికీ ఈ సీట్ కట్టబెట్టబోతున్నారు అనే చర్చ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతోంది. 🔄

bottom of page