top of page

🆔🔒 ఆధార్ అప్‌డేట్ అంటూ అప్పనంగా దోచేశాడు..

📍ఉత్తర ప్రదేశ్ లోని నోయిడా సెక్టార్ 78లోని మహాగుణ్ మోడరన్ సొసైటీలో నివాసం ఉంటున్న మున్మున్ భట్టాచార్య తన ఆధార్ కార్డులో చిరునామాను అప్ డేట్ చేయడానికి గూగుల్ సాయాన్ని కోరింది. అందులో కనిపించిన హెల్ప్ లైన్ నంబర్ ను సంప్రదించి తనకు సాయం చేయాలని కోరింది. అయితే ఆమె అనుకోకుండా ఒక సైబర్ మోసగాడితో తన సమాచారాన్ని పంచుకుంది. అతడు ఆధార్ కార్డు ఏజెంట్ గా నటిస్తూ ఫోన్ లో మున్మున్ ఆధార్ వివరాలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఫోన్ కు ఓ లింక్ పంపాడు. దానిని మున్మున్ క్లిక్ చేయగానే ఆమె బ్యాంకు ఖాతాలోని రూ.50,000 విత్ డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. మున్మున్ వెంటనే సమీపంలోని సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.



👮‍♂️ పోలీసులకు ఫిర్యాదు..

🕵️‍♂️ ఇన్ స్పెక్టర్ సర్వేష్ కుమార్ సింగ్ ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మున్మున్ సంప్రదించిన నంబర్ ను పరిశీలించగా అది ఫేక్ అని తేలింది. ఆధార్ కార్డు అప్ డేట్ పేరుతో అతడు మున్మున్ తో ఒక మొబైల్ అప్లికేషన్ డౌన్ లోడ్ చేయించి, ఆమె బ్యాంకు ఖాతాలో సొమ్మును కాజేసినట్టు గుర్తించారు. అయితే అతడు ఒక లావాదేవీలో డబ్బు కాజేశాడు గానీ తర్వాత చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ మోసగాడిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఆధార్ పోలీసులు వినియోగదారులకు కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా ఆధార్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

🔒 ఈ పద్ధతి ఎంతో భద్రం..

🌐 మరి ఆన్ లైన్ లో ఆధార్ కార్డును ఎలా అప్ డేట్ చేసుకోవాలి అనే సందేహం చాలామందికి వస్తుంది. ఈ కింద చెప్పిన పద్ధతిను అనుసరిస్తే మనం ఎటువంటి నష్టం లేకుండా చూసుకోవచ్చు. ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అధికార వెబ్ సైట్ అందుబాటులో ఉంది. ఈ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా వినియోగదారులు తమ ఆధార్ కార్డులో చిరునామా, ఇతర వివరాలు మార్పు చేసుకోవాలి.

🌐 https://uidai.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించాలి. 🏡 హోమ్ పేజీలో my Aadhaar ట్యాబ్ కింద ఉన్న update your Aadhar పై క్లిక్ చేయాలి. 🔄 అప్ డేట్ డెమెగ్రాఫిక్ డేటా అండ్ స్టేటస్ ను ఎంపిక చేయాలి. 🆔 ఆధార్ కార్డు నంబర్, క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. 🔄 అప్ డేట్ చేయాలనుకునే నిర్ధిష్ట వివరాలను ఎంచుకోవాలి. 🔗 అప్ డేట్ ఆన్ లైన్ ఆధార్ అనే దానిని క్లిక్ చేయాలి. సమాచారాన్ని ఎంటర్ చేయాలి.

Comentários


bottom of page