top of page
Suresh D

నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం🗳️✨


ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 18వ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. తొలి దశ ఎన్నికల్లో భాగంగా మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ స్థానాలకు శుక్రవారం అంటే ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. దీంతోపాటు అరుణాచల్ ప్రదేశ్‌లో 60, సిక్కింలో 92 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.కాగా, తొలి దశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఎన్నికల సామాగ్రితో సిబ్బంది ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగే ఎన్నికల ప్రక్రియను శాంతియుంతంగా, సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకుంది. ఓటింగ్ కేంద్రాల వద్ద పెద్ద మొత్తంలో కేంద్ర బలగాలను మోహరించింది. 

102 లోకసభ స్థానాలకు జరిగే పోలింగ్‌లో 16.63 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనుండగా.. ఇందుకోసం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 18 లక్షల మంది సిబ్బంది ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. కొండ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం ఐదు గంటలకే ముగియనుంది. 🗳️


bottom of page