అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను.. బిలియనీర్ ఎలన్ మస్క్(Elon Musk) ఇంటర్వ్యూ చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూ ప్రసారాలకు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. తమ ఇంటర్వ్యూ సందర్భంగా సైబర్ దాడి జరిగినట్లు ఎలన్ మస్క్ తెలిపారు. ఇద్దరి మధ్య చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. కానీ ఆ షో 40 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. ఎక్స్ యూజర్లు ఆ ఇంటర్వ్యూను యాక్సెస్ చేసుకోవడంలో ఇబ్బందిపడ్డారు.
తమపై డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్(డీడీఓఎస్) అటాక్ జరిగినట్లు మస్క్ తెలిపారు. తమ డేటా లైన్లు అన్నీ నిర్వీర్యం అయినట్లు ఆయన పేర్కొన్నారు. రెండు గంటల పాటు సాగిన ఇంటర్వ్యూలో ట్రంప్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు మస్క్. రిపబ్లికన్ ప్రచారానికి మద్దతు పలకాలని ఆయన ఓటర్లను కోరారు.
ఎక్స్ అకౌంట్లపై డీడీఓఎస్ దాడులు జరిగాయని, దాని వల్ల వెబ్‌సైట్ ఓవర్‌లోడ్ అవుతుందని, దాంతో ఆ సైట్ యాక్సెస్ ఇబ్బంది అవుతుందని మస్క్ తెలిపారు. సైబర్ దాడి జరిగిదంటే.. ట్రంప్‌కు వ్యతిరేకత ఉందని అర్థం అవుతుందని ఆయన చెప్పారు. డీడీఓఎస్ దాడివల్ల.. ఒక్కసారిగా భారీ సంఖ్యలో సిగ్నల్స్ వస్తాయని, దీంతో ఆ లైన్ డిస్టర్బ్ అవుతుందని సింగపూర్ సైబర్‌స్పేస్ డైరెక్టర్ ఆంథోనీ లిమ్ తెలిపారు.