top of page

హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పిన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం


షేక్‌ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వంపై తిరుగుబాటు రాజీనామా అనంతరం బంగ్లాదేశ్‌లో అస్థిరత, అశాంతి నెలకొన్నది. చాలా ప్రాంతాల్లో హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేవాలయాలపై సైతం అల్లరిమూకలు దాడులకు తెగబడుతూ దోచుకుంటున్నాయి. ఈ క్రమంలో దాడులకు వ్యతిరేకంగా ఆదివారం వేలాది మంది నిరసనకారులు ఢాకా వీధుల్లోకి వచ్చి మైనారిటీలకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కాగా.. భద్రత కల్పించడంలో విఫలమైనందుకు హిందూ సమాజానకి తాత్కాలిక ప్రభుత్వంలోని హోం వ్యవహారాల సలహాదారు బ్రిగేడియర్‌ జనరల్‌ (రిటైర్డ్‌) ఎం సఖావత్‌ హుస్సేన్‌ క్షమాపణలు చెప్పారు. మైనారిటీలను రక్షించడం మెజారిటీ సమాజానికి అత్యంత కర్తవ్యమని తాము ఆదేశాలు ఇచ్చామన్నారు. అలా చేయకుండా మసీదులో నమాజ్ చేయడంలో బిజీగా ఉంటే.. వారు ఎందుకు విఫలమయ్యారో సమాధానం చెప్పాల్సి ఉంటుందని హుస్సేన్ స్పష్టం చేశారు. భద్రత కల్పించేందుకు, మైనారిటీలను రక్షించడం మా మతంలో భాగమన్నారు. మైనారిటీలను క్షమాపణలు కోరుతున్నానన్నారు. దేశమంతా అశాంతిలో ఉందని.. పోలీసులు సైతం మంచి స్థితిలో లేరన్నారు. కాబట్టి వారిని రక్షించాలని తాను సమాజాన్ని కోరుతున్నానన్నారు. మైనారిటీ సొంత సోదరులవంటివారేనని.. మేమంతా కలిసే పెరిగామన్నారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page