top of page
MediaFx

వాట్సాప్‌లో ఆకర్షిస్తున్న నయా అప్‌డేట్..


బ్లాక్ మెసేజెస్ ఫ్రమ్ అన్‌నోన్ అకౌంట్స్ అనేది తెలియని ఖాతాల నుంచిసందేశాలను నిరోధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం అందరికీ అందుబాటులో లేదు. వాట్సాప్ బీటా వినియోగదారులకు ప్రస్తుతం పరీక్షల దవ కింద అందుబాలో ఉంది. ఓ నివేదిక ప్రకారం వాట్సాప్ వినియోగదారులను స్పామ్ బారిన పడకుండా రక్షించడమే వాట్సాప్ లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. వాట్సాప్ ఆధారిత మోసాలు, ఇతర సైబర్ మోసాల గురించి గత కొన్ని రోజులుగా పెరుగుతున్న దృష్ట్యా వాట్సాప్ ఈ నయా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం క్లౌడ్ సెక్ సైబర్ సెక్యూరిటీ ప్లాట్‌ఫారమ్ మౌరిస్‌బాట్ అనే మాల్వేర్ ఆండ్రాయిడ్ వాట్సాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటుందని నివేదించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందుల నుంచి వినియోగదారులకు మేలు చేసేలా నయా అప్‌డేట్ తీసుకువస్తుంది.


మౌరిస్‌బాట్ వాట్సాప్‌లో నకిలీ ట్రాఫిక్ చలాన్ సందేశాల ద్వారా వ్యాప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఆ మెసేజ్‌లో వచ్చిన లింక్ క్లిక్ చేస్తే హానికరమైన యాప్‌ను ఆటోమెటిక్‌గా ఇన్‌స్టాల్ అవుతుంది. వియత్నాంకు చెందిన హ్యాకర్లు కొత్త మాల్వేర్ ‘మౌరిస్‌బాట్’ని పెద్ద ఎత్తున ఎలా ఉపయోగిస్తున్నారనే వివరాలను కూడా నివేదిక హైలైట్ చేసింది. దీని నుంచి వినియోగదారులను రక్షించడానికి వాట్సాప్ బ్లాక్ మెసేజెస్ ఫ్రమ్ అన్‌నోన్ అకౌంట్స్ ఫీచర్‌ను తీసుకువస్తుంది. ఈ ఫీచర్ మెసేజ్‌లను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుందని, ఇది ఇప్పటికే ఉన్న ‘బ్లాక్ అన్‌నోన్ కాలర్స్’ మాదిరిగానే ఉంటుంది. అయితే ఒక ట్విస్ట్ ఉంది. కొత్త ఫీచర్ ‘నిర్దిష్ట పరిమితి’ దాటిన తర్వాత తెలియని వారికి మెసేజ్‌లు పంపడాన్ని అనుమతించదు. అయితే ఈ ‘నిర్దిష్ట పరిమితి’కి సంబంధించిన కచ్చితమైన నిర్వచనం పేర్కొనలేదు.

bottom of page