top of page

ఇంస్టాలో పవన్ కళ్యాణ్ పెట్టిన ఫస్ట్ పోస్ట్ ఏంటో తెలుసా

పవన్ కల్యాణ్ రాకతో ఇన్‌స్టాగ్రామ్ షేక్ అవుతోంది. ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే పవన్ ఇన్‌స్టా హ్యాండిల్‌కి 1.7 మిలియన్ ఫాలోవర్లు వచ్చారు. దీంతో తాజాగా పవన్ ఫస్ట్ పోస్ట్ ఏం చేస్తారనేదానిపై ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు.

"నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తా".. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ ఇది. అయితే నిజానికి పవన్ మేనియా చూసిన ప్రతిసారి అందరికీ ఇదే అనిపిస్తుంది. ఇక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ అక్కడ కూడా ఆల్‌టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే 1.7 మిలియన్ ఫాలోవర్లను పవన్ సాధించారు. ఈ వేగం చూస్తుంటే ఇంకొన్ని గంటల్లోనే 2 మిలియన్లను క్రాస్ చేసే అవకాశం ఉంది. అయితే పవన్ తన ఫస్ట్ పోస్ట్ దేని గురించి చేస్తారనే దానిపై జోరుగా చర్చ జరుగుతుంది.ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ 1 మిలియన్ ఫాలోవర్స్‌ని సాధించిన 9వ సెలెబ్రెటీగా పవన్ రికార్డు సెట్ చేశారు. దీంతో త్వరలోనే పవన్ తన ఫస్ట్ ఫోస్ట్ పెడతారని అంతా ఎదురుచూస్తున్నారు. పవన్ ఇన్‌స్టాలో తన అప్‌కమింగ్ మూవీ OG ఫస్ట్ లుక్‌ను ఈ హ్యాండిల్ నుంచే విడుదల చేస్తారని ఇప్పటికే డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ అఫిషియల్‌గా ప్రకటించింది. అయితే ఇది ఫస్ట్ పోస్ట్ కాదని వార్తలు వస్తున్నాయి. మొదటి పోస్ట్ పొలిటికల్ సెటైర్ అయి ఉంటుందని అంటున్నారు.

వరుస సినిమాలు

ప్రస్తుతం OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు పవన్. అలాగే తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటిస్తున్న బ్రో (BRO) సినిమా షూటింగ్ కూడా కంప్లీయ్ అయిపోయింది. ఈ చిత్రం జులై 28న థియేటర్లలో విడుదల కానుంది. ఇక పవన్ త్వరలోనే హరీష్ శంకర్ డైరెక్షన్‌లో చేస్తున్న‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీ సెకండ్ షెడ్యూల్‌లో అడుగుపెట్టబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున ఈ చిత్రంలో శ్రీలీలతో పాటు మరొక హీరోయిన్ ఫిమేల్ లీడ్స్‌గా నటిస్తున్నారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page