top of page
Suresh D

ఇన్‌స్టాగ్రామ్‌లో మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌..🔍📱

ప్రముఖ సోషల్‌ మీడియా సైట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ తాజాగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. 'బ్యాక్‌డ్రాప్‌' పేరుతో ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేశారు.

ప్రముఖ సోషల్‌ మీడియా సైట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ తాజాగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. 'బ్యాక్‌డ్రాప్‌' పేరుతో ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేశారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం పెరుగుతోన్న నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌ సైతం ఏఐ ఆధారిత ఫీచర్‌ను తీసుకొచ్చింది. 'బ్యాక్‌డ్రాప్‌' పేరుతో ఈ కొత్త ఏఐ మీడియా ఎడిటింట్ టూల్‌ను తీసుకొచ్చింది. ఇన్‌స్టా తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌ యూజర్లకు ఫొటోల కోసం సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. 

కృత్రిమ మేథ ఆధారంగా రూపొందించిన ఈ టూల్‌తో ఫొటోలను డైనోసార్లతో నడిచినట్లు, కుక్క పిల్లలతో ఆడుతున్నట్లు డిజైన్ చేసుకోవచ్చు. బ్యాక్‌ గ్రౌండ్‌ను మార్చడానికి ఏఐ టూల్‌ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం బ్యాక్‌డ్రాప్‌ ఫీచర్‌ అమెరికాలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే త్వరలోనే భారత్‌తో పాటు మరికొన్ని దేశాల్లో అందుబాటలోకి తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే.. ఇన్‌స్టా ఇంతకు ముందు స్టోరీస్‌లకు ఫిల్టర్‌లు, ప్రత్యేక ఎఫెక్ట్‌లను అందించగా, ఇప్పుడు తీసుకొచ్చిన ఏఐ పవర్‌ టూల్‌తో ఫొటోలను మరింత అందంగా తీర్చుదిద్దుకోవచ్చు. బ్యాక్‌డ్రాప్‌ అనే ఆప్షన్‌ ఎంచుకుని ఫొటోను యాడ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు.🔍📱

bottom of page