మీరు రెగులర్గా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ లు పెడుతున్నారా ? ఇపుడిపుడే మీకు ఫాలోవర్స్ పెరుగుతున్నారా ? అయితే మీరు కొంచం జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే మీకు కొంతమంది వ్యక్తులు👽 మెస్సేజ్ చేస్తారు . 200 రూపాయలకు 1000 ఫాలోవర్లు ఇంకా 2000 వేల రూపాయలిస్తే 10000 వేల ఫాలోవర్లను తీసుకొస్తాం అంటారు . శాంపిల్ గా ఒక 200 ఫాలోవర్స్ ను కొన్ని సెకండ్స్ లోనే తెప్పిస్తారు. మీరు ఆశ్చర్య పోయి పొరపాటున డీల్ కి ఒప్పునుకున్నారనుకోండి ఇక అంతే సంగతులు. అదేంటి ఫాలోవర్స్ వస్తే మంచిదేగా అనుకోవద్దు. ఎందుకంటే అవన్నీ ఫేక్ ఫాలోవర్స్ కాబట్టి. వాటివల్ల మీకు లైక్ లు కామెంట్లు రాకపోగా ఇంస్టాగ్రామ్ మీ అకౌంట్ ని కూడా బ్లాక్ చేస్తుంది. అసలు ఇదంతా ఏంటి అనుకోకండి ఆ ఫేక్ ఫాలోవర్స్ నే బోట్స్ అంటారు . ఇవి ఇంస్టాగ్రామ్ కొన్ని ప్రమోషన్స్ కోసం వాడుతుంది. కానీ ఈ అకౌంట్స్ ని కొంతమంది ఇల్లీగల్ గా వాడి మిమ్మల్ని ఫాలో చేయిస్తారు .ఇది ఇంస్టాగ్రామ్ పాలసీ కి వ్యతిరేకం . ఈ ఫేక్ ఫాలోవర్స్ వల్ల ఎలాంటి యూస్ ఉండదు. ఇలాంటి విషయాల నుంచి ఇంస్టాగ్రామ్ యూజర్స్ చాలా జాగ్రత్తగా ఉండక తప్పదు మరి .