top of page

🪔 వినాయక పూజలకు శ్రీకారం.. 🚀 చంద్రయాన్ 3 రాకెట్ నమూనా.. 🙏

🚀 ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌యోగించిన చంద్ర‌యాన్‌ 3 విజయవంతంతో ప్ర‌పంచ దేశాలను మ‌న దేశాన్ని ఆకర్షించేలా చేసిన శాస్త్ర‌వేత్త‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ 🚀 చంద్రయాన్ 3 రాకెట్ నమూనా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి అందరినీ అబ్బురపరిచారు.. 🚀

రాకెట్ నమూనా నిర్మాణానికి ఒక చిత్ర‌కారుడు స‌హాయం తీసుకొని సుమారు వంద మంది యువకులు నెల రోజుల పాటు నిరంతరం కష్టించి యాభై అడుగుల రాకెట్ న‌మూనాను డిస్కో లైట్స్ తో త‌యారు చేశారు. 🌟 అనంతరం ప్రత్యేక పూజలు చేసి వినాయక విగ్రహ ఆవిష్కరణ చేసి ప్రత్యేక పూజలు జరిపారు. 🪔 చంద్రయాన్ 3 రాకెట్ నమూనాతో రాష్ట్రంలోని విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరికీ జాతీయతా భావాన్ని పెంపొందించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.. 🚀 ఈ మండపం ఏర్పాటుతో పొనుగుటివ‌ల‌సలో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. 🌙

🚀 ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావటం ఎంతో సంతోషమని, ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి ప్రయోగాన్ని విజయవంతం చేశారని అందుకు తమ మద్దతుగా 🚀 రాకెట్ రూపంలో గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి తమ వంతు ధన్యవాదాలు తెలిపామని అంటున్నారు యువకులు.. 🪔 అంతేకాకుండా శివుడి తల పై ఉండే చంద్రుడు శివుడులో ఒక భాగమని, అలాంటి చంద్రుడు మీదకు చంద్రయాన్ రాకెట్ వెళ్లిందని, ఆ రాకెట్ ద్వారా విఘ్నేశ్వరుడుని చంద్రుని వద్దకు పంపినట్లు భావిస్తున్నామని అంటున్నారు.. 🌕🙏






Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page