top of page
Suresh D

ఉప్ప‌ల్ స్టేడియంలో భార‌త్, ఇంగ్లండ్ మ్యాచ్.. విద్యార్థులతో పాటు వీరికి కూడా ఉచిత ప్రవేశం

గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని టెస్ట్‌ మ్యాచ్ 2వ రోజు అంటే జనవరి 26న భారత సాయుధ దళాల కుటుంబాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రకటించింది.

జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతుంది. అయితే గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని టెస్ట్‌ మ్యాచ్ 2వ రోజు అంటే జనవరి 26న భారత సాయుధ దళాల కుటుంబాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రకటించింది. 2024 రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా భారత సాయుధ దళాల కుటుంబాలకు మేము ఉచిత ప్రవేశం ఇవ్వబోతున్నాం. దీని ద్వారా భారత సైనికుల కుటుంబాలను గౌరవించాలని హెచ్‌సీఏ నిర్ణయించింది. కాబట్టి రిపబ్లిక్ డే రోజున హైదరాబాద్ క్రికెట్ స్టేడియంలో భారత సాయుధ దళాల కుటుంబాలకు ఉచిత ప్రవేశం ఉంటుందని హెచ్‌సీఏ తెలిపింది. మొదటి టెస్ట్ మ్యాచ్ టిక్కెట్లు జనవరి 18 నుండి Paytm ఇన్‌సైడర్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో www.insider.in వెబ్‌ సైట్ లో అందుబాటులో ఉంటాయి. జనవరి 22 నుంచి జింఖానా మైదానంలో ఆఫ్‌లైన్ టిక్కెట్ల విక్రయం ప్రారంభమవుతుంది. ఇక్కడ రూ. 200 నుండి రూ.4,000 వరకు గల టికెట్లను విక్రయించనున్నారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లోని 6 నుండి 12వ తరగతుల విద్యార్థులను భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆహ్వానించింది. వారు తమ గుర్తింపు కార్డును చూపడం ద్వారా ఉచిత ప్రవేశం పొందవచ్చు. స్కూల్ యూనిఫాం ధరించిన విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని కూడా అందజేస్తామని హెచ్‌సీఏ తెలిపింది.

bottom of page