top of page
Shiva YT

🚄 మీరు ప్రయాణించాలనుకుంటున్న రైళ్లన్నీ దాదాపుగా రద్దే! కారణం ఏంటంటే..

🛑 తాజాగా తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ పరిధిలో 24,25 తేదీల్లో పలు రైళ్ల రద్దు చేస్తున్నట్టు వాల్తేర్ డివిజన్ ప్రకటించింది. అలమండ-కోరుకొండ-విజయనగరం సెక్షన్లో ఆటో సిగ్నలింగ్ పనుల కారణంగా రద్దు నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. 🚦🚫

🚂 రద్దైన రైళ్ల వివరాలు ఇవే:

విశాఖ-కొరాపుట్-విశాఖ (08546- 08545)

విశాఖ-రాయపూర్-విశాఖ (08528-08527)

విశాఖ-పలాస-విశాఖ (08532-08531)

విజయనగరం- విశాఖ-విజయనగరం (07469-07468)

విశాఖ-పలాస- విశాఖ (07470-07471)

విశాఖ-రాయగడ-విశాఖ (08504-08503) పాసింజర్ ప్రత్యేక రైళ్లను ఆయా రోజుల్లో రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. 🚞🚫

🛤️ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఆగస్టు 31 వరకు పలు రైళ్ల రద్దు 🛤️ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్లో విజయవాడ- గుణదల స్టేషన్ల మధ్య 3వ లైన్ కు సంబంధించి నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. నేటి నుంచి నుంచి ఆగస్టు 29 వరకు గుంటూరు-విశాఖ (17239) సింహాద్రి ఎక్స్ప్రెస్ తో పాటు సికింద్రాబాద్-విశాఖ (12740) గరీబ్ రథ్ తో పాటు, గుంటూరు- రాయగడ (17243), విశాఖ-కడప (17488) తిరుమల, విజయవాడ- విశాఖ (12718), విశాఖ- విజయవాడ(12717) రత్నాచల్, విశాఖ-లింగంపల్లి (12805) జన్మభూమి, విశాఖ-మహబూబ్ నగర్ (12861) రైళ్లను కూడా రద్దు చేసినట్లు ప్రకటించారు. 🚂🔴🚫

bottom of page