అసలు ఏమి జరిగిందంటే..
2023 జనవరి 23న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి వీధి దాటుతుండగా సియాటెల్‌లోని పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీ కొట్టింది. వేగంగా వస్తున్న పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో జాహ్నవి 100 అడుగుల మేర కిందపడిపోయింది. ఈ కేసు దర్యాప్తు గురించి పోలీసు అధికారి డేనియల్ అడెరెర్ స్పందిస్తూ జాహ్నవి మరణంపై చాలా హేళనగా మాట్లాడడమే కాదు నవ్విన వీడియో ఒకటి ఆ మధ్య వైరల్ అయ్యింది. జాహ్నవి ఓ సాధారణ వ్యక్తి.. అసలు మరణానికి విలువలేదు’ అని అడెరెర్ మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపాయి. అప్పుడు ఆ పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం సైతం డిమాండ్ చేసింది. వెంటనే అడెరెర్ ను అప్పుడు సస్పెండ్ చేయగా.. తాజాగా అతనిపై తుది చర్యలు తీసుకున్నారు.
పోలీసులకే అగౌరవం..
జాహ్నవి మృతిపై తమ డిపార్ట్మెంట్ అధికారి అడెరెర్ చేసిన వ్యాఖ్యలు మృతురాలి కుటుంబాన్ని తీవ్రంగా గాయపరచడమే కాదు సియాటెల్ పోలీసు డిపార్ట్‌మెంట్‌కు మాయని మచ్చగా మారాయని పోలీసు డిపార్ట్‌మెంట్ చీఫ్ సూ రహర్ చెప్పారు. ప్రజల కోసం పోలీసు అధికారులు అని.. వారి విశ్వాసం కోల్పోకూడదని చెప్పారు. కనుక తప్పని సరిగా పోలీసులు ఉన్నత ప్రమాణాలను పాటించాలి.. ఈ నేపథ్యంలో అడెరెర్‌ను పోలీసు అధికారిగా విధుల్లో కొనసాగించడం డిపార్ట్‌మెంట్‌కే అగౌరవమని చెప్పారు. అందుకే ఆయన్ని ఉద్యోగంలో నుంచి తొలగించి నట్లు ఆయన స్పష్టం చేశారు.