ఇండియన్ 2 టీంకు ఊహించని షాక్ తగిలింది. స్ట్రీమింగ్ టైమ్ లైన్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఇండియన్ 2 టీంకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లీగల్ నోటీసులు జారీ చేసింది. జులై 12న థియేటర్లలో విడుదలైన ఇండియన్ 2 నిబంధనల ప్రకారం (హిందీలో) ఓటీటీలోకి రావాలంటే కనీసం 8 వారాల సమయం ఉండాలి. దీనికి విరుద్దంగా ఆగస్టు 9న (నెలలోపే) నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ నియమాన్ని పాటిస్తే నిర్మాతలకు PVRInox, Cinepolis వంటి ప్రధాన జాతీయ మల్టీప్లెక్స్ చైన్‌లలో విడుదల చేసే అవకాశం ఉండదు. అయితే ఇండియన్ 2 టీమ్ మొదట ఈ షరతులకు అంగీకరించిప్పటికీ మల్టీప్లెక్స్‌లలో సినిమా స్క్రీనింగ్ అయింది. హిందీలో సినిమాలకు తప్పనిసరిగా థ్రియాట్రికల్, ఓటీటీ విడుదలలకు కనీసం 8 వారాల వ్యవధి ఉండాలని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను రూపొందించింది. కానీ హిందుస్తానీ 2 ముందే నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండటంతో.. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. మరి దీనిపై కమల్ హాసన్ టీం ఎలా స్పందిస్తుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.