2030 నాటికి భారత్ మరింత బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగనుంది. 💰 ఎస్ అండ్ పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఈ విషయాన్ని తెలిపింది. 2030 నాటికి 7.3 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగనుందని తెలిపింది. 🌏
జపాన్‌ను వెనక్కి నెట్టడం ద్వారా ఆసియాలో అదిపెద్ద రెండో ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని S&P గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ తన తాజా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ తన నివేదికలో తెలిపింది. 📈 ఇదిలా ఉంటే 2021, 2022లో వేగవంతమైన ఆర్థిక వృద్ధి తర్వాత, భారత ఆర్థిక వ్యవస్థ 2023 ఆర్థిక సంవత్సరంలో బలమైన వృద్ధిని చూపుతూనే ఉంది. 💹
S&P గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అంచనా ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.2 నుంచి 6.3 శాతం పెరగనుందని చెబుతోంది. 💹 దీంతో భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. 💹 ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7.8 శాతంగా ఉంది. 💹 ఈ లెక్కన ఆర్థిక వ్యవస్థ ఇలాగే వృద్ధిలో కొనసాగితే.. భారత్ రెండో స్థానంలోకి రావడం ఖాయంగా తెలుస్తోంది. 📊 దేశీయంగా డిమాండ్‌లో బలమైన వృద్ధి కనిపిస్తుండడం సానుకూల అంశమని ఎస్ అండ్ పీ చెబుతోంది. 📊
🇺🇸 అమెరికా అగ్ర స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత చైనా రెండో స్థానంలో ఉండగా, మూడో స్థానంలో జపాన్ ఉంది. 🌏 అయితే ప్రస్తుతం భారత్‌లో కనిపిస్తున్న వృద్ధి ఇలాగే కొనసాగితే 2030 నాటికి భారతదేశ జీడీపీ జర్మనీని అధిగమిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 💹 ఇక 2039 నాటికి భారత్‌లో 110 కోట్ల మంది భారతీయులకు ఇంటర్‌నెట్ లభించనుందని, 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి రాకవడంతో దేశంలో ఇ-కామర్స్ గణనీయంగా 4జీ నుంచి 5జీ సాంకేతికతకు మారడంతో ఇ-కామర్స్ గణనీయంగా వృద్ధి చెందనుంది. 🛒