top of page
Suresh D

ఇండియాలో బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ 🎥😞

మనదేశంలో 22 మంది స్టార్లతో ఒక పెద్ద బాలీవుడ్ సినిమా తీస్తే ఇండియాలో బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీగా చెత్త రికార్డును సాధించింది. 8 మంది నటులు పరిశ్రమ నుంచి గుడ్ బై చెప్పేసేలా చేసింది.

మనదేశంలో 22 మంది స్టార్లతో ఒక పెద్ద బాలీవుడ్ సినిమా తీస్తే ఇండియాలో బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీగా చెత్త రికార్డును సాధించింది. 8 మంది నటులు పరిశ్రమ నుంచి గుడ్ బై చెప్పేసేలా చేసింది. దర్శకుడైతే సినిమా తీయడమే మానేశాడు. 2002లో 22 మంది స్టార్లు కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ 'జానీ దుష్మన్-ఏక్ అనోఖి కహానీ' మాత్రం భారీ ఫ్లాపైంది. నిర్మాతకు భారీ నష్టాలను తీసుకొచ్చింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, సన్నీ డియోల్, అర్షద్ వార్సీ, సోనూ నిగమ్, ఆదిత్య పంచోలి, రాజ్ బబ్బర్, అర్మాన్ కోహ్లీ, మనీషా కొయిరాలా, శరద్ కపూర్, సిద్ధార్థ్ రే, రజత్ బేడీ, రంభ, కిరణ్ రాథోడ్, పింకీ కాంప్‌బెల్, ఆఫ్తాబ్ శివదాసాని, అమ్రిష్ పూరి, జానీ లివర్, ఉపాసనా సింగ్, అమన్ వర్మ, షాబాజ్ ఖాన్ లాంటి నటులెందరో నటించారు. సింగర్ సోను నిగమ్ తొలిసారిగా ఈ చిత్రంలో నటించాడు. ఈ సినిమాపై భారీ అంచనాలుండేవి. ఇండస్ట్రీ హిట్ అవుతుందని భావించారు. ఈ సినిమాతోనే అర్మాన్ కోహ్లీ తిరిగి సినిమాల్లోకి ప్రవేశించాడు. రూ.18 కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మించారు. రాజ్ కుమార్ కోహ్లి నిర్మాత, దర్శకుడిగా వ్యవహరించారు. బాక్సాఫీస్ వద్ద రూ.11 కోట్లు రాబట్టింది. రాజ్ కుమార్ ఆ తర్వాత నుంచి సినిమాలు తీయడం మానేశాడు. ఆయన చివరి చిత్రం ఇదే. ఈ సినిమాకు రివ్యూలు పూర్తి వ్యతిరేకంగా వచ్చాయి. ఇందులో నటించినవారిని కూడా సినీ ప్రియులు విమర్శించారు.🎥

bottom of page