కేవలం చట్టసభల్లోనే కాదు పార్టీ పరంగా కూడా స్థానికంగా కమిటీలు వేసుకునే పరిస్థితి కూడా లేదు.. పేరుకి కొన్ని కమిటీలు వేసినా కూడా అవి ఆక్టివ్ గా లేవు. ప్రజల నుంచి కనీస సహకారం కొరవడంతో ఏమీ చేయలేని నిస్సహయ స్థితిలో పడింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో రెండు సామాజిక వర్గాలు రెండు పార్టీల మధ్య ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో మూడో సామాజిక వర్గానికి కానీ మూడో పార్టీ కానీ స్పేస్ లేని పరిస్థితి రాష్ట్రం నెలకొని ఉంది.
కేవలం చట్టసభల్లోనే కాదు పార్టీ పరంగా కూడా స్థానికంగా కమిటీలు వేసుకునే పరిస్థితి కూడా లేదు.. పేరుకి కొన్ని కమిటీలు వేసినా కూడా అవి ఆక్టివ్ గా లేవు. ప్రజల నుంచి కనీస సహకారం కొరవడంతో ఏమీ చేయలేని నిస్సహయ స్థితిలో పడింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో రెండు సామాజిక వర్గాలు రెండు పార్టీల మధ్య ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో మూడో సామాజిక వర్గానికి కానీ మూడో పార్టీ కానీ స్పేస్ లేని పరిస్థితి రాష్ట్రం నెలకొని ఉంది. తెలుగుదేశం – వైసీపీ ల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతుండడంతో మిగతా రాజకీయ పార్టీలకు వ్యాక్యూమ్ లేకుండా పోతోంది.ఇలాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ పై అందరికంటే కాంగ్రెస్ నేతలకే అనుమానం ఎక్కువ. ఎందుకంటే కాంగ్రెస్ కేడర్ అంతా వైసీపీకి షిఫ్ట్ అయిపోయింది. ఇక కొద్దిపాటి నేతలు ఉన్నప్పటికీ కార్యకర్తలు ఎవరూ లేని పార్టీగా కాంగ్రెస్ మిగిలిపోయి ఉంది. రాష్ట్రంలో విభజన తర్వాత అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను అడ్రస్ చేసేలా రాహుల్ గాంధీ పర్యటిస్తే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీ రాష్ట్ర నేతల్లో ఉంది. ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా రాహుల్ రాష్ట్రంలో పర్యటించి రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలను అడ్రస్ చేస్తూ వాటి పరిష్కారానికి పార్టీ తీసుకునే విధానపరమైన నిర్ణయాన్ని చెప్తే ప్రజల్లో కొంతైనా విశ్వాసం కలుగుతుందన్న భావన రాష్ట్ర నేతలలో నెలకొంది. అందుకే ఇటీవల ఖమ్మం వచ్చిన సందర్భంలో తిరిగి వెళ్లే సమయంలో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ లో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలతో సమావేశమైనప్పుడు ఈ తరహా చర్చ జరిగిందట. ఆ సమయంలో రాష్ట్రంలో ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం సెంటిమెంట్ గా మారిందని రాష్ట్ర ప్రజలందరూ దాని గురించి చర్చించుకుంటున్నారని కాబట్టి స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షలకు హాజరై స్వయంగా మద్దతు ప్రకటించి అక్కడి నుంచే ఇతర రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తే బాగుంటుందని, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి కొంతైనా మెరుగవుతుందని పార్టీ నేతలు చెప్పారట. దానికి సానుకూలంగా స్పందించిన రాహుల్ గాంధీ జూలై లేదా ఆగస్టులో వస్తానని చెప్పారట. అనంతరం ఢిల్లీ వెళ్ళిన తర్వాత కూడా రాష్ట్ర నేతలతో ఈ సమస్యలపై మాట్లాడే ప్రయత్నం చేశారట.వీలైతే జూలై నెలాఖరులో కానీ, ఆగస్టు మొదటి వారంలో కానీ విశాఖకి వచ్చి స్టీల్ ప్లాంట్ సందర్శించి కార్మికులతో ఒక పూట దీక్షలో కూర్చుని అక్కడి నుంచి రాష్ట్ర సమస్యలను అడ్రస్ చేసి తిరిగి విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే ప్రణాళికని రూపొందించాలని తన కార్యాలయాన్ని రాహుల్ కోరారని ఆ సమాచారాన్ని మాకు చేరవేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం చెబుతోంది.