భారత్-ఇండోనేషియా మధ్య ఆర్థికపరమైన సంబంధాలపై ఇరుదేశాల ఆర్థిక మంత్రులు దృష్టిసారించారు. ఈ మేరకు 'ఇండియా-ఇండోనేషియా ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డైలాగ్(EFD Dialogue)'ని ప్రారంభించారు.
ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను బలపరిచేందుకు భారత ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, ఇండోనేషియా ఆర్థిక మంత్రి శ్రీ ముల్యాణి ఇంద్రావతి తీసుకున్న ఈ ఆడుగులకు ఆదివారం జరిగిన జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల(FMCBG) 3వ సమాావేశం వేదికగా మారింది. ఈ ప్రయత్నం భారత్, ఆగ్నేయాసియా మధ్య సహకారాలను సులభతరం చేయడంతో పాటు ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి దోహదం చేస్తుంది. ఇక ఈ సమావేశం నిర్మలా సీతారామన్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగింది. 💼💰🌐ఈ సందర్భంగా సీతారామన్ మాట్లాడుతూ.. ''1991 నాటి 'లుక్ ఈస్ట్ పాలసీ', దాని తర్వాత వచ్చిన 'యాక్ట్ ఈస్ట్ పాలసీ' కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో మెరుగైన వృద్ధిని సాధించాం. ప్రధానంగా వ్యాపార, సాంస్కృతిక రంగాల్లో ఈ సంబంధాలు మెరుగుపడ్డాయి'' అని అన్నారు. 💬📈🌍