ఐపీఎల్‌లో సత్తా చాటిన క్రికెటర్లలో యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టులోకి ఎంపికయ్యారు. కానీ, గేమ్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్ మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు.
కరేబియన్ సిరీస్ కోసం రింకూను జట్టులోకి తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.అయితే, బోర్డు వర్గాల సమాచారం ప్రకారం, కరీబియన్ టూర్‌కు రింకూకి టిక్కెట్ లభించనప్పటికీ, వచ్చే ఆగస్టులో ఐర్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో అతను జట్టులో చోటు పొందుతాడని వార్తలు వినిపిస్తున్నాయి.వెస్టిండీస్ పర్యటన తర్వాత, మెన్ ఇన్ బ్లూ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో T20 సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్‌కు వెళుతుంది. ఈ పర్యటనలో ఉన్న వన్డే జట్టులోని 7గురు క్రికెటర్లు ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో ఆడరు. దీంతో యువతకు జాతీయ జట్టు తలుపులు తెరుచుకోనున్నాయి.ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రికెటర్లను ఈ సిరీస్‌కు ఎంపిక చేయాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.అలాగే, ఆసియా క్రీడలకు క్రికెట్ జట్టును పంపాలని బీసీసీఐ నిర్ణయించగా, వన్డే ప్రపంచకప్‌కు ముందు జరుగుతున్న ఆసియా క్రీడలకు భారత్ 'బి' జట్టును పంపాలని నిర్ణయించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రింకూ లాంటి యువ క్రికెటర్లను ఐర్లాండ్ సిరీస్‌లో ఆడించాలని బోర్డు నిర్ణయించింది.దీనికి తోడు BCCI ఇప్పటికే ఎమర్జింగ్ ఆసియా కప్ కోసం భారత జట్టును ప్రకటించింది. ఈ టోర్నమెంట్ కోసం IPL నుంచి చాలా మంది ఆటగాళ్లు జట్టులో ఎంపికయ్యారు. ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లు సీనియర్ జట్టుకు ఎంపికయ్యే అవకాశం ఉంది.