top of page

IND vs BAN 1st Test: కోహ్లీపై చిరాకు పడ్డ రోహిత్ శర్మ.. వైరలవుతున్న హిట్ మ్యాన్ రియాక్షన్

IND vs BAN 1st Test: ప్రస్తుతం క్రికెట్‌లో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. బాల్‌ ట్రాకింగ్‌తో పాటు ఫీల్డ్‌లో జరిగే ప్రతి అంశాన్ని అన్ని యాంగిల్స్‌ నుంచి కవర్‌ చేస్తున్నారు. ఇప్పుడు అంపైర్‌ల మిస్టేక్‌లతో బ్యాటర్లు వికెట్లు కోల్పోయే పరిస్థితులు చాలా తగ్గాయి. ఒకవేళ అంపైర్లు పొరపాటున అవుట్‌ ఇచ్చినా, బ్యాటర్లు రివ్యూ కోరి వికెట్‌ని కాపాడుకోవచ్చు. కానీ టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఆ పని చేయలేకపోయాడు. దీనికి రోహిత్‌ శర్మ, అంపైర్‌ ఇచ్చిన రియాక్షన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?

చెన్నై, చెపాక్‌ స్టేడియంలో భారత్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌ తొలి టెస్టు రెండో రోజు భారత్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బంగ్లాదేశ్‌ను 149కే ఆలౌట్‌ చేసి ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 227 పరుగుల ఆధిక్యం సంపాదించింది. తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.

విరాట్‌ కోహ్లి ఎలా అవుట్‌ అయ్యాడంటే?

రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ 10 (17), రోహిత్‌ శర్మ 5 (7) పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. జైస్వాల్‌ అవుట్‌ అయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లి, శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ జోడీ కొంతసేపు బంగ్లాదేశ్‌ బౌలర్లను సమర్థంగానే ఎదుర్కొంది. అయితే అనూహ్యంగా కోహ్లి 18 ఓవర్లో మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. అప్పటికి కోహ్లి 37 బంతుల్లో 17 పరుగులతో ఉన్నాడు. కోహ్లి కన్ఫూజన్‌గా కనిపించడంతో, బంగ్లాదేశ్‌ ఎల్‌బీడబ్ల్యూ అప్పీల్‌ చేయడంతో అంపైర్‌ అవుట్‌గా నిర్ధారించాడు.

మెహిదీ హసన్‌ మిరాజ్, కోహ్లికి కొంచెం అవుట్‌ సైడ్‌ ఆఫ్‌లో బాల్‌ వేశాడు. బంతి తిరిగి బ్యాటర్‌ వైపునకు స్పిన్‌ అయింది. కోహ్లి లెగ్ సైడ్‌లో షాట్‌ ఆడేందుకు ట్రై చేశాడు. బాల్‌ నేరుగా ప్యాడ్‌లకు తగిలింది. అంపైర్‌ అవుట్‌ ఇచ్చాక, కోహ్లి తన పార్ట్‌నర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో కొద్దిసేపు చర్చించాడు. ఇద్దరూ చర్చించాక కోహ్లి ఎల్‌బీడబ్ల్యూ రివ్యూ తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడు.

అసలు ట్విస్ట్‌ ఎలా బయటపడిందంటే?

కోహ్లిని అవుట్‌గా ప్రకటించాక రీప్లేలో ఓ షాకింగ్‌ విషయం బయటపడింది. స్క్రీన్‌పై డిస్‌ప్లే చేసిన రీప్లేలో బ్యాట్‌కి బాల్‌ టచ్‌ అయిందని తేలింది. విరాట్‌ ఆ విషయం గ్రహించలేదు. రివ్యూ తీసుకొని ఉంటే, అవుట్‌ కాకుండా ఉండేవాడు. ఇలా వికెట్‌ కోల్పోవడం కెప్టెన్‌ రోహిత్‌ శర్మకి నచ్చలేదు. బిగ్‌ స్క్రీన్‌పై రీప్లే చూసిన రోహిత్ కాస్త చిరాకు వ్యక్తం చేశాడు. జరిగిన విషయం తెలిసి అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో కూడా నవ్వుకున్నాడు. ఈ వీడియోలు, ఇమేజ్‌లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page