top of page

హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. ఎమ్మెల్యే మాగంటి సోదరుడి ఇంట్లో తనిఖీలు..

హైదరాబాద్‌లో మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మాగంటి గోపీనాథ్ బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. మొత్తం 100 ఐటీ బృందాలు నగరం వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. పలు కంపెనీలు, వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్‌లో మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మాగంటి గోపీనాథ్ బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. మొత్తం 100 ఐటీ బృందాలు నగరం వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. పలు కంపెనీలు, వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. కూకట్‌పల్లిలోని ఓ విల్లాస్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు. బుధవారం సాయంత్రానికే దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఐటీ అధికారులు భారీగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇంత భారీ సంఖ్యలో ఐటీ అధికారులు రావడంతో.. గట్టి టార్గెటే ఉందని అంతా అనుకున్నారు. అందరూ అనుకున్నట్లుగానే.. ఉదయమే తమ పని మొదలు పెట్టారు ఐటీ అధికారులు. నిర్ణీత వ్యక్తులు, నాయకులు, ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page