మీ ఫ్రెండ్స్ పెట్టే వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్ మిమ్మల్ని ట్యాగ్ చేస్తే ఈ కొత్త ఫీచర్ ద్వారా ఆ స్టేటస్‌ను మీరు తిరిగి రీషేర్ చేయవచ్చు. ప్రస్తుతానికి బీటా టెస్టర్‌లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులో లేదు. వాట్సాప్ భవిష్యత్ అప్‌డేట్స్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. స్టేటస్ అప్‌డేట్ ఇంటర్‌ఫేస్‌లో కొత్త బటన్‌ను కనిపిస్తుందని, ఈ బటన్ ద్వారా వారు పేర్కొన్న స్టేటస్ అప్‌డేట్ సులభంగా రీ షేర్ చేయవచ్చు. ముఖ్యంగా స్క్రీన్‌షాట్‌లను తీయడం లేదా మీడియాను ప్రైవేట్‌గా పంపమని ఫ్రెండ్స్‌ను అడిగే అవసరం లేకుండా ఈ ఫీచర్ ద్వారా సింపుల్‌గా స్టేటస్‌ను రీషేర్ చేయవచ్చు.
స్టేటస్ రీషేర్ ఫీచర్ ద్వారా కంటెంట్ షేరింగ్‌ను సరళీకృతం అవ్వడమే కాకుండా యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. స్టేటస్ అప్‌డేట్ ఇంటర్‌ఫేస్ ద్వారా నేరుగా స్టేటస్ రీషేర్ చేయవచ్చు. అలాగే ఈ ఫీచర్ గురించి తాజా అప్‌డేట్‌ల కోసం ఎక్స్ వాట్సాప్ బీటా ఇన్‌ఫో పేజీను ఫాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కంటెంట్ షేరింగ్‌ను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్న ఈ ఫీచర్ అభివృద్ధిలో ఉన్నప్పటికీ ఈ ఫీచర్ గురించి టెక్ నిపుణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.