top of page

🌧️తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ వార్నింగ్.. మరో 5 రోజులు కుండపోతే..☔

🌀వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈనెల 24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వార్నింగ్ బెల్ మోగించింది. దీని ప్రభావంతో దక్షిణ రాష్ట్రాలైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ. రాబోయే ఐదు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.హైదరాబాద్‌తోపాటు.. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. అటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. వరదలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ.. 13 జిల్లాలకు ఆరెంజ్‌, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.🚨🚨


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page