top of page

‘ఐ హేట్ యూ’ అంటోన్న యంగ్ హీరో.. యూత్‏ను ఆకట్టుకుంటున్న ట్రైలర్..🎬

ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. స్నేహం, ప్రేమ బంధాల చుట్టూ సాగే కథలా కనిపిస్తోంది. ఇక అంతకు మించిన థ్రిల్లింగ్ పాయింట్, క్రైమ్ సస్సెన్స్ డ్రామాను కూడా ఇందులో చూపించబోతోన్నారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ట్రైలర్ చూస్తుంటే రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. హీరో యాక్షన్, రొమాంటిక్ సీన్స్ ట్రైలర్‌లో హైలెట్ అవుతున్నాయి.

‘నిన్ను ఎప్పుడూ వదిలి వెళ్లను’ అంటూ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ఆరంభం అవుతుంది. ప్రాణ స్నేహితులైన ఇద్దరు అమ్మాయిల జీవితాల్లో జరిగిన ఘటనలే ఐ హేట్ యు కథ అని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ‘దేవుడు కాదు.. ఈ మనుషులే మనకు అన్యాయం చేస్తున్నారు’.. అనే ఎమోషనల్ డైలాగ్ సైతం ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్‌లోని విజువల్స్, ఆర్ఆర్ అన్నీ కూడా ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉన్నాయి. ప్రేమలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని ఇది వరకు మేకర్లు చెప్పిన మాటలు నిజమని ఈ ట్రైలర్‌ చూస్తే తెలుస్తుంది. కొత్త ప్రేమ కథను ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారనిపిస్తోంది. ఫిబ్రవరి 2న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. 🎥


bottom of page