top of page
Suresh D

ఈ పండ్లు నెలరోజులపాటు తీసుకుంటే.. ఆ సమస్యకి చెక్ పెట్టొచ్చు..!✨

మనలో కొందరు ఆల్కహాల్ , శీతల పానీయాలు ఎక్కువగా తీసుకుంటారు. ఇది కాలేయానికి మరింత హాని కలిగించవచ్చు . వీటిని తట్టుకోవాలంటే, మీ డైట్ లో ఈ పండ్లను చేర్చుకోవాలి. అవేంటో ఇక్కడ చూద్దాం ..

1. అవకాడోలు ఇప్పుడు అన్ని ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాయి. దీనిలో గ్లూటాతియోన్ అధికంగా ఉంటుంది. ఇది లివర్ డీటాక్సిఫికేషన్ కి చాలా ఉపయోగపడుతుంది. ఆల్కహాల్ వంటి రసాయనాల నుండి కాలేయాన్ని రక్షించడానికి గ్లూటాతియోన్ ముఖ్యమైనది. ఫ్యాటీ లివర్ సమస్యలు తమ ఆహారంలో అవకాడో చేర్చుకోవాలి.  

2. బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ వంటి పండ్లు ఫ్యాటీ లివర్‌తో పోరాడి కాలేయ సమస్యలను నివారిస్తాయి. ఈ బెర్రీలు కడుపులోకి ప్రవేశించి కాలేయాన్ని రక్షిస్తాయి. 

3. మనం ఎక్కువగా తినే పండ్లలో జామకాయ కూడా ఒకటి. దీనిలో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. లివర్ డిటాక్సిఫికేషన్ కి ఈ విటమిన్ సి ఎంతో అవసరం . అందువల్ల, ప్రతిరోజూ మీ ఆహారం లో జామను చేర్చుకోండి.

4. ప్రస్తుతం , స్టార్ ఫ్రూట్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. దీనిలో 8 రకాల ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి నిర్విషీకరణకు , కాలేయాన్ని రక్షించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.✨

bottom of page