top of page
Suresh D

నిమ్మకాయ, అల్లంతో తయారైన ఈ డ్రింక్ తాగితే..మీరే నమ్మలేరు

శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించుకునేందుకు నేచురల్ డ్రింక్స్‌ని డైట్‌లో చేర్చితే బరువు తగ్గుతారు. అలాంటి డ్రింక్ లెమన్ పీల్, అల్లం డ్రింక్. ఉదయాన్నే పరగడపున తాగితే బరువు తగ్గడంలో బాగా పనిచేస్తుంది. నిమ్మతొక్క, అల్లంతో తయారైన ఈ డ్రింక్ తాగితే బరువు తగ్గడమే కాకుండా బెల్లీ ఫ్యాట్‌ని తగ్గిస్తుంది. తాజా అల్లాన్ని తురుము, చిన్న ముక్కలుగా కట్ చేయాలి. నిమ్మ తొక్కని నీటిలో కలపండి. రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచి తాగితే అందులోని గుణాలు నీటిలో కలిసిపోతాయి. నిమ్మతొక్క, అల్లం తొక్కని సరిగ్గా పీల్ చేసి గాలి చొరబడని డబ్బాలో ఉంచండి. వేడి నీటిలో ఓ కప్పు ఎండిన అల్లం, నిమ్మ తొక్క వేయండి. వీటిని రెండు నిమిషాలు మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. దీని వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది.

bottom of page