top of page

🌍 దక్షిణాది రాష్ట్రాల గొంతు అణచివేస్తే.. ప్రజా ఉద్యమం తప్పదు..

🏛️ కేంద్రం త్వరలోనే డీలిమిటేషన్ చేపట్టనుంది. దీనిపై ఇప్పటికే పలు ప్రకటన చేసింది. అంటే జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ సీట్లతో పాటు పార్లమెంట్ సీట్లు కూడా పెరగనున్నాయి.

అయితే ఈ ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే చర్చ నడుస్తోంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే డిలిమిటేషన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ (కే తారక రామారావు), ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మందుగా ఎంపీ సీట్లలో రాష్ట్రాల వారీగా వచ్చే మార్పులను ఓ సంస్థ ఇచ్చిన రిపోర్ట్‌ను మంత్రి కేటీఆర్ ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పుడున్న సీట్ల కంటే 26 తగ్గబోతున్నట్టుగా ఉంది. అదే జరిగితే తీవ్రమైన ఉద్యమం తప్పదంటూ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాల గొంతును నొక్కాలని చూస్తే.. ప్రజా ఉద్యమం తప్పదంటూ కేటీఆర్ హెచ్చరించారు. అన్ని విషయాలను కేంద్రం దృష్టిలో పెట్టుకుంటుందనీ.. న్యాయం గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. కేటీఆర్ ట్వీట్ ను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రీట్విట్ చేశారు. డీలిమిటేషన్ విషయంలో దక్షిణ భారతదేశం అన్యాయం జరిగే అవకాశం ఉందని ఒవైసీ పేర్కొన్నారు. 👥🗳️📢

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page