top of page
MediaFx

కమలా హారిస్‌ గెలిస్తే దేశం నాశనమే..


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమలా హారిస్‌ను ఒక డమ్మీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. అధ్యక్షుడు జో బైడెన్‌ కంటే ఆమె అసమర్థురాలు అని అన్నారు. ఆమె గెలిస్తే దేశం నాశనమవుతుందని వ్యాఖ్యానించారు. ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌కు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కమలా హారిస్‌ ఒక రాడికల్‌ లెఫ్ట్‌ ఉన్మాది అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. పార్టీలో తిరుగుబాటు కారణంగానే డెమొక్రటిక్‌ అభ్యర్థిగా బైడెన్‌ స్థానంలో కమలా హారిస్‌ను మార్చారన్న తన ఆరోపణను ట్రంప్‌ పునరుద్ఘాటించారు. దేశ సరిహద్దు భద్రత విషయంలో హారిస్‌ ఘోరంగా విఫలయ్యారని, వేలాది మంది దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారని అన్నారు. బైడెన్‌-హారిస్‌ పాలనలో ఓపెన్‌ బోర్డర్‌ పాలసీ కారణంగా దేశంలో నేరాలు గణనీయంగా పెరిగాయని విమర్శించారు.


bottom of page