top of page

పడగవిప్పిన నాగుపాము.. తోక ముడిచిన పెద్దపులి..వీడియో చూస్తే అవాక్కే


అడవిలో ఒక పెద్దపులి దాహం తీర్చుకునేందుకు నీళ్లను తాగేందుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంతలోనే ఆ నీటిలో ఒక నాగుపాము పాకుతూ వెళ్తుంది. నీటి కోసం వచ్చిన ఆ పెద్ద పులికన్నుకాస్త పాము మీద పడింది. పాము దగ్గరకు వెళ్లింది. ఇంతలోపాము.. ఒక్కసారిగా నా దగ్గరకు వస్తావా.. అన్నట్టుగా కోపంతో పడగ విప్పి పులి వైపుకు తిరుగుతుంది. అంతే.. పెద్దపులి హడిలిపోయింది. నాకెందుకు వచ్చిన తంటా అనుకుందో ఏమోగానీ, ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి మెళ్లిగా వెనక్కు జరిగిపోతుంది. పాము ఏమాత్రం తగ్గకుండా.. పులి వైపుకు పాక్కుంటా ముందుకు వెళ్తుంది. పాపం.. పెద్దపులి మాత్రం.. మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది. ఈ షాకింగ్‌ వీడియో ప్రస్తుతం నెటిజన్లు తెగ ఆకర్షిస్తోంది. మొత్తానికి ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  ఇది చూసిన నెటిజన్లు వామ్మో.. పెద్దపులికి భలే ధమ్కీ ఇచ్చిందిరా బాబోయ్‌ అంటూ ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు.. మరికొందరు మాత్రం.. పాముతో పెట్టుకుంటే మటాషే అంటూ అంటున్నారు. ఇలా చాలా మంది చాలా రకాలు తమ అభిప్రాయాలను తెలియజేశారు.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page