top of page
MediaFx

ఇలా చేస్తే ఎప్పుడు డబ్బు సమస్యతో బాధపడరు..


ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ప్రతి చిన్న, పెద్ద విషయం చాలా ముఖ్యమైనది. మన జీవనశైలి, జీవన విధానాలు మన జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. జీవితాన్ని నడపాలంటే అతి ముఖ్యమైనది డబ్బు. డబ్బు నమ్మకమైన తోడుగా పరిగణించబడుతుంది. అయితే కొంత మందిలో డబ్బు సమస్య ఎప్పుడూ ఉంటుంది. అయితే జీతం తక్కువ లేదా ఎక్కువ అన్నది పెద్దగా పట్టింపు లేకుండా జీవితం సాగిపోవాలంటే.. ఎలా పొదుపు చేయాలో మీకు తెలిస్తే చాలు. అప్పుడు డబ్బు లేకపోవడం అనే సమస్యను శాశ్వతంగా వదిలించుకోవచ్చు. చాణక్య నీతిలో ఏమి చెప్పారంటే?

పొదుపు చేయడం కూడా ఒక కళ. ఈ విషయాన్నీ చాణక్య నీతిలో కూడా ఆచార్య చాణక్యుడు వెల్లడించాడు.  పొదుపు అనేది అందరూ ఒకేలా చేయలేరు. అయితే పొదుపు చేసేవారికి జీవితంలో డబ్బుకు కొరత ఉండదనేది కూడా నిజం. ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రంలో చెప్పిన విధంగా జీవితంలో పొడుపు పాటిస్తే త్వరగా ధనవంతులు అవుతారు. జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరత లేకుండా జీవిస్తారు. అందువల్ల ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేయకూడదు. ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేసే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ పేదరికం నుంచి బయటపడలేరు. జీవితంలో ధనవంతుడు కాలేడని చాణక్య నీతి చెబుతోంది. మీరు మీ చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితులను చూసినా ఏ వ్యక్తికైనా పొదుపు అత్యంత ముఖ్యమైన విషయం అని గుర్తించవచ్చు. తెలివిగా పెట్టుబడి పెట్టండి

ఆచార్య చాణక్యుడు కూడా డబ్బు పెట్టుబడి గురించి చాలా విషయాలు చెప్పాడు. ఏ వ్యక్తి అయినా పెట్టుబడి పెట్టే ముందు పదే పదే ఆలోచించాలి. పెట్టుబడి పెట్టే సమయంలో రిస్క్ తక్కువగా ఉన్న ప్రదేశాలలో మాత్రమే పెట్టుబడి పెట్టాలి. లేదంటే సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎవరైనా తమ విధిని మార్చుకోవాలనుకుంటే.. తప్పని సరిగా తన ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుందని చాణక్య నీతిలో స్పష్టంగా చెప్పబడింది. ఇది పొదుపుకు మార్గాన్ని తెరుస్తుంది.

bottom of page