top of page
MediaFx

‘పుష్ప 2’లో నుంచి మెలోడీ సాంగ్ ?🎶

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న సినిమా పుష్ప 2: ది రూల్. ఐతే, పుష్ప సినిమాలో చూపే బంగారమాయెనే శ్రీవల్లీ అనే మెలోడీ సాంగ్ చాలా బాగా హిట్ అయ్యింది. ఇప్పుడు పుష్ప 2 లో కూడా మళ్లీ అలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తున్నారట. పైగా ఈ పాటను త్వరలో విడుదల చేస్తారని టాక్ నడుస్తోంది.ఇప్పటికే, పుష్ప సినిమా ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా తొలి పాట బాగా హిట్ అయ్యింది. పైగా ఈ మొదటి సాంగ్ సోషల్ మీడియాతో సహా వరల్డ్ వైడ్ గా మ్యూజిక్ ఛార్ట్స్ ని రూల్ చేసింది. మరి పుష్ప 2 మెలోడీ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా ‘పుష్ప 2’ కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఆగస్టు 15న, 2024 లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.


bottom of page