top of page

ప్రపంచకప్ ప్రారంభోత్సవం ఆకస్మికంగా రద్దు చేసిన బీసీసీఐ.. ఎందుకంటే? 🏆

ICC ODI World Cup 2023 Opening Ceremony Cancelled: BCCI అక్టోబర్ 4 న నిర్వహించ తలపెట్టిన ప్రారంభ వేడుకలను రద్దు చేసింది. ఆశా భోంస్లే, రణవీర్ సింగ్, తమన్నా భాటియా, శ్రేయా ఘోషల్, శంకర్ మహదేవన్, అరిజిత్ సింగ్ వంటి స్టార్స్ ప్రారంభ వేడుకకు హాజరవుతారని ఇదివరకే ప్రకటించారు. 🏏🌟

అయితే, ప్రస్తుతం, ఈ వేడుకలు రద్దు చేసినట్లు తెలుస్తోంది. 🏏🌟మొత్తం 10 జట్ల కెప్టెన్లు అక్టోబర్ 3న అహ్మదాబాద్ చేరుకుంటారు. ఇక్కడ సారథులతో సమావేశం మాత్రమే 🏏నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ICC World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి మరో ఆటంకం వచ్చి పడింది. ప్రపంచకప్‌ షెడ్యూల్‌పై మొదట్లో విమర్శలు, 🏏🌟ఆ తర్వాత వేదికలపై గందరగోళం, టిక్కెట్లలో లోపం ఇలా అన్నీ బీసీసీఐ అనుకున్నట్టు జరగడం లేదు. ఇదిలా ఉండగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభమయ్యే వరకు అక్టోబర్ 4 న ఏర్పాటు చేసిన ప్రారంభ వేడుకలను బీసీసీఐ రద్దు చేసింది. ఇన్‌సైడ్ స్పోర్ట్ రిపోర్ట్‌ ప్రకారం, ముందుగా BCCI ప్రారంభ వేడుకలను ప్లాన్ చేసింది.🏏


Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page