top of page
Suresh D

ఇండస్ట్రీకి ఐబొమ్మ వార్నింగ్.. 🎬📽️

ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు ఐబొమ్మలో చూడొచ్చు. ఈ వెబ్‌సైట్‌ను ఎన్నిసార్లు బ్లాక్ చేసినా.. కొత్త డోమైన్లతో నిర్వాహకులు రన్ చేస్తునే ఉన్నారు. నిర్మాతలకు కోట్లలో నష్టం వస్తుండడంతో టాలీవుడ్ ఐబొమ్మపై ఫోకస్ పెట్టింది. దీంతో ఐబొమ్మ పేరుతో వార్నింగ్ లెటర్ వైరల్ అవుతోంది.

ఐబొమ్మ గురించి మూవీ లవర్స్‌కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. థియేటర్, ఓటీటీలోకి వచ్చిన మూవీ క్షణాల్లో ఈ సైట్‌లో ప్రత్యక్షం అవుతుంది. ఈ సైట్‌లో ఎవరు అప్‌లోడ్ చేస్తున్నారో.. ఎక్కడి నుంచి అప్‌లోడ్ చేస్తున్నారో తెలియదు గానీ.. విడుదలైన ప్రతి సినిమా కొన్ని గంటల వ్యవధిలోనే ఐబొమ్మలో ఉంటుంది. ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు ఐబొమ్మలో చూడొచ్చు. ఈ వెబ్‌సైట్‌ను ఎన్నిసార్లు బ్లాక్ చేసినా.. కొత్త డోమైన్లతో నిర్వాహకులు రన్ చేస్తునే ఉన్నారు. నిర్మాతలకు కోట్లలో నష్టం వస్తుండడంతో టాలీవుడ్ ఐబొమ్మపై ఫోకస్ పెట్టింది. దీంతో ఐబొమ్మ పేరుతో వార్నింగ్ లెటర్ వైరల్ అవుతోంది. తమ జోలికి వస్తే సీరియస్ రియాక్షన్ ఉంటుందని టాలీవుడ్ ఇండస్ట్రీని లేఖలో హెచ్చరించారు.

మా వెబ్‌సైట్‌ ఐబొమ్మపై దృష్టి పెట్టడం ఆపాలని.. మీరు మా మీద ఫోకస్ చేస్తే.. మాకు మీపై ఎక్కడ ఫోకస్ చేయాలో తెలుసని వార్నింగ్ ఇచ్చారు.హీరోలకు అంత రెమ్యూనరేషన్ అవసరమా..? అని.. అది కొడుకు అయినా.. ఎవరు అయినా అని అడిగారు. ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని వాళ్లు ఏమైపోతారని కబుర్లు చెప్పకండి అని అన్నారు. సినిమాలో ఎక్కువ శాతం రెమ్యూనరేషన్స్, విదేశాలలో షూటింగ్స్, ట్రిప్స్‌కు ఖర్చుపెడుతున్నారు. మరి ప్రొడక్షన్‌ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చుపెడుతున్నారు..? మన దేశంలో షూటింగ్ చేస్తే ఖర్చు తగ్గుతుంది కదా..? ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని కదా అని ప్రశ్నించారు. 🎬📽️


bottom of page