top of page

సంకల్ప్ రెడ్డి స్పై థ్రిల్లర్‌.. ‘ఐబీ71’ ఇపుడు తెలుగులో

ఘాజీ, అంతరిక్షం సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సంకల్ప్‌ రెడ్డి. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఐబీ 71’. ఇండియాస్ టాప్‌ సీక్రెట్‌ మిషన్‌ అనేది ఉప శీర్షిక. తుపాకీ మూవీ లో విలన్ గా నటించిన విద్యుత్‌ జమ్వాల్‌ ఇందులో హీరోగా నటించాడు.

ఘాజీ, అంతరిక్షం సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సంకల్ప్‌ రెడ్డి. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఐబీ 71’. ఇండియాస్ టాప్‌ సీక్రెట్‌ మిషన్‌ అనేది ఉప శీర్షిక. తుపాకీ మూవీ లో విలన్ గా నటించిన విద్యుత్‌ జమ్వాల్‌ ఇందులో హీరోగా నటించాడు. 1971లో ఇండియన్ ఏజెంట్స్, పాకిస్తాన్ లోకి వెళ్లి చేసిన ఒక మిషన్ ఆధారంగా సంకల్ప్‌ రెడ్డి ‘ఐబీ 71’ను తెరకెక్కించాడు. మే 12న థియేటర్లలో విడుదలైన ఈ స్పై థ్రిల్లర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్‌ వద్ద బాగానే కలెక్షన్లు రాబట్టింది. థియేటర్లలో ఆకట్టుకున్న ‘ఐబీ 71’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ఈ స్పై థ్రిల్లర్‌ డిజిటల్‌ రైట్స్‌ను కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఒప్పందం ప్రకారం శుక్రవారం జులై 7 నుంచి ‘ఐబీ 71’ను అందుబాటులోకి తీసుకొచ్చింది.కాగా స్ట్రీమింగ్‌ డేట్‌ ప్రకటించే సమయంలో ‘ఐబీ 71’ వెర్షన్‌పై క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడీ సినిమా హిందీతో పాటు తెలుగు వెర్షన్‌ కూడా అందుబాటులో ఉంది. ఇందులో అనుపమ్‌ ఖేర్‌, విశాల్‌ జెత్వా, ఫైజాన్‌ ఖాన్‌, అశ్వంత్‌ భట్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్‌ ఆర్‌. విహారి బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించారు. టీ- సిరీస్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. ఈ వీకెండ్‌లో మంచి ఇంటెన్స్‌ థ్రిల్లింగ్‌ సినిమా చూడాలనుకునేవారికి ‘ఐబీ 71’ మంచి ఛాయిస్‌ అని చెప్పుకోవచ్చు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page