top of page

‘నేను తెలంగాణ బిడ్డనే’..ఎమ్మెల్సీ కవిత 📜

తెలంగాణ ఎమ్మెల్సీ కవిత బంజారాహిల్స్‎లో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర గీతం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

టీఎస్పీఎస్సీ చైర్మన్‎గా మహేందర్ రెడ్డి నియామకంపై అనేక అభ్యంతరాలు వస్తున్నాయన్నారు. అలాగే అవినీతి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని తెలిపారు. ఆయనను పదవి నుంచి తొలగించి జ్యూడీషియల్ ఎంక్వైరీ చేపట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేసిన పనులు తామ ప్రభుత్వం చేసినట్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో కరెంట్ కోతలు మొదలయ్యాయని వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్లుగా, తెలంగాణ అసెంబ్లీలో అడ్వైజర్లుగా ఆంధ్రా వాళ్లు ఎందుకని ప్రశ్నించారు. గతంలో తనకు సలహాదారులే వద్దన్న రేవంత్ ఇప్పుడు ఎందుకు నియమించుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహంపై సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు ఎమ్మెల్సీ కవిత. ‘తెలంగాణ తల్లి విగ్రహం నాలా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు.. నేనూ తెలంగాణ బిడ్డనే కదా.?’ అని కౌంటర్ ఇచ్చారు. 🎭🗣️

bottom of page