🏞️ ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు కేరళ. పచ్చని చెట్లు, నదులతో ఎటు చూసినా అందమైన ప్రకృతి దర్శనమిచ్చే ఈ ప్రాంతానికి ఒక్కసారైనా వెళ్లాలని చాలా మంది భావిస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఐఆర్‌టీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి ఐఆర్‌టీసీ అధికారిక ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఈ టూర్ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది.
మొదటి రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్ (ట్రెన్ నెంబర్ 17230) బయలు దేరుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
రెండో రోజు మధ్యాహ్నం 12.55 గంటలకు ఎర్నాకులం టౌన్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. అక్కడి నుంచి మున్నార్‌కు వెల్లాల్సి ఉంటుంది. మున్నార్‌లో రాత్రి బస ఉంటుంది. అక్కడ కొన్ని ప్రదేశాలను సందర్శిస్తారు.
మూడవ రోజు ఉదయం ఎర్నాకులం నేషనల్ పార్క్, టీ మ్యూజియం వంటి చూడొచ్చు. మూడో రోజు కూడా మున్నార్‌లోనే ఉండాలి.
నాల్గవ రోజు ఉదయం మున్నార్ నుంచి బయలుదేరి అల్లప్పీ వెళ్లాలి. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత కొన్ని ప్రదేశాలను సందర్శిస్తారు. ఆరోజు రాత్రి అల్లెప్పీలోనే ఉంటారు.
5వ రోజు ఎర్నాకులంకు వెళ్లి ఉదయం 11.20 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభవమతుంది. 6వరోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. 🚆🌴🌄✈️