top of page
Shiva YT

కెనడాలో హైదరాబాద్‌ విద్యార్ధి మృతి.. అసలేం జరిగిందంటే! 😢

ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లిన హైదరాబాద్‌ విద్యార్ధి కార్డియాక్‌ అరెస్టుతో మృతి చెందాడు. 📚 విద్యార్ధి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ కేంద్ర మంత్రి ఎస్‌. జైశంకర్‌ను విద్యార్ధి కుటుంబం అభ్యర్థించింది. 💔

వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన షేక్‌ ముజమ్మిల్‌ అహ్మద్‌ (25) అనే విద్యార్ధి ఉన్నత చదువుల నిమిత్తం 2022లో కెనడా వెళ్ళాడు. 🌎 అక్కడ ఒంటారియాలోని కిచెనర్‌ సిటీలో ఉన్న వాటర్లూ క్యాంపస్‌లో కొనెస్టోగా కాలేజీలో ఐటీ మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్నాడు. 🎓 అయితే గత వారం రోజులుగా అహ్మద్‌ జ్వరంతో బాధపడుతున్నాడు. 🤒 ఈ క్రమంలో శుక్రవారం (ఫిబ్రవరి 16) కార్డియాక్‌ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయాడు. 😢 అహ్మద్‌ మృతి చెందిన విషయాన్ని అతడి స్నేహితుడు హైదరాబాద్‌లోని కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి సమాచారమిచ్చాడు. 📞 మజ్లిస్‌ బచావో టెహ్రెక్‌ (ఎంబీటీ) పార్టీ అధికార ప్రతినిధి అజ్మద్ ఉల్లా ఖాన్‌ ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. 📰

గత వారం నుంచి అహ్మద్ జ్వరంతో బాధపడుతున్నాడని, అయితే గుండె ఆగిపోవడంతో అహ్మద్ మరణించినట్లు అతని స్నేహితుడి నుంచి అతని కుటుంబానికి కాల్ వచ్చిందని ఆయన పోస్టులో తెలిపారు. 😔 ఈ వార్త విన్న అహ్మద్‌ తల్లిదండ్రులు, మొత్తం కుటుంబ సభ్యుటు షాక్‌కు గురయ్యారు. 😢 అతని మృత దేహాన్ని వీలైనంత త్వరగా తిరిగి హైదరాబాద్‌కు పంపమని TorontoCGIని దయచేసి అడగండి అంటూ పోస్టులో తెలిపారు. 📬 అలాగే కేంద్ర మంత్రి జైశంకర్‌ను అభ్యర్ధిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు రాసిన లేఖను కూడా ఆయన తన పోస్టులో జత చేశాడు. ✉️ వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్రాన్ని కోరారు. 🙏


bottom of page