అవును.. మీరు చదివింది కరెక్టే.. కొత్తమంది దుర్మార్గులు తమ స్వార్థం కోసం ముసలి వాళ్లను, పిల్లలను, ఆడవాళ్లను బిక్షం ఎత్తుకునేలా చేస్తున్నారు. 🤦♂️
వారిని రోడ్లపై అడుక్కోనిచ్చి.. ఆ డబ్బుతో బెగ్గింగ్ మాఫియా సభ్యులు జల్సాలు చేస్తున్నారు. 💰 తాజాగా, హైదరాబాద్ నగరంలో బెగ్గింగ్ మాఫియా వెలుగుచూసింది. 🕵️♂️ సిటీలో బెగ్గింగ్ మాఫియా గుట్టు రట్టుచేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. 👮♂️ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, KBR పార్క్ దగ్గర బెగ్గింగ్ చేస్తున్న 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. 🚓 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటకలోని గుల్బర్గాకు చెందిన అనిల్ పవార్ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని ఫతేనగర్‌లో నివాసముంటున్నాడు. 🏠 వివిధ ప్రాంతాల నుంచి ముసలి వాళ్లను తీసుకువచ్చి.. వారితో భిక్షాటన చేయిస్తున్నాడు. 🧔 అలా భిక్షాటన చేసుకొచ్చిన మొత్తాన్ని తానే తీసుకుని, వారికి రోజుకు 200 రూపాయలు జీతంగా ఇస్తున్నాడు. 💸 పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ అధికారులు బెగ్గింగ్ మాఫియాను అరెస్ట్ చేశారు. 👥 వారు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ కింద అనిల్ పవార్ పై కేసు నమోదు చేశారు. 📋 అనంతరం అతణ్ణి జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. 🚓 అనిల్ వెనుక ఇంకా ఎవరు ఉన్నారు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 🚔